twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను క్షమించండి...నాకు ఆ షర్ట్ వేసింది వాళ్ళే: టీషర్ట్ వివాదం పై నోరువిప్పిన ప్రియాంక

    |

    విమెన్ స్పెషల్స్ నుంచి ఫ్యాషన్ మేగజైన్స్ వరకూ వరుసగా కవర్ చేసేస్తున్న ప్రియాంకా.. ఇప్పుడు కాండే నెస్ట్ వారి ట్రావెల్ మేగజైన్ పైకి కూడా ఎక్కింది. హాట్ అందాలను చూపిస్తూ అమ్మడు ధరించిన టీ షర్ట్ బాగా హాట్ గా ఉంది. కవర్ పేజ్ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిందీ భామ. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఇతర దేశాలకు తరలివెళ్లే శరణార్థులను - వలసవాదులను కించపరిచేలా ఉన్న రాతలు కలిగిన వైట్ కలర్ టీషర్ట్ ను వేసుకుని ఉన్న ప్రియాంక ను చూడటం తోనే ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తయి.

    Priyanka Chopra apologises over 'insensitive' refugee Tshirt Controversy

    జనాలకు అంత కోపం తెప్పించే విధంగా ఆ టీషర్ట్ పై ఏముందో తెలుసా... తెల్లటి టీషర్ట్ పై... రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్‌లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. మొదటి ముగ్గురిగా ఉండడం కంటే ట్రావెలర్‌గా ఉండడం ఇష్టమని అర్థం. ట్రావెలర్ మేగజైన్ ను హైప్ చేయడం పాయింట్ అయినా, దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతకడం కష్టమై.. పొట్టకూటి కోసం శరణార్థులుగా, వలసవాదలుగా ఇతర దేశాలను ఆశ్రయిస్తున్న వారిని తీవ్రంగా కించపరిచేలా ప్రియాంక ఆ ఫోజిచ్చిందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటీమణి అయిన ప్రియాంకకు ఓ శరణార్థి బాధ ఎలా తెలుస్తుందని అంటూ విరుచుకు పడ్దారు.

    Priyanka Chopra apologises over 'insensitive' refugee Tshirt Controversy

    ఈ క్రమంలో జనాలకు విపరీతమైన కోపం తెప్పించిన ఆ టీషర్ట్ పై బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా స్పందించింది. ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై తాను ధరించిన టీషర్ట్ పై తనను క్షమించాలని వేడుకుంది. వారి వారి మనోభావాలను కించపరిచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టు పేర్కొన్న ప్రియాంక... కొండే నాస్ట్ ట్రావెలర్ వాళ్లే స్పెషల్ గా ఈ టీషర్ట్ ను తెప్పించారని వారే తనను వేసుకోమన్నారని తెలిపింది. అయితే ఆ టీషర్ట్ ధరించడం వెనక తాము శరణార్థులను - వలసవాదులను కించపరచడానికి చేసే ఉద్దేశ్యం లేదని.. ప్రస్తుతం నెలకొన్న జెనోఫోబియాను గుర్తించడానికి ఈ టీషర్ట్ ధరించాల్సిందిగా వారు కోరగా తాను ధరించానని తెలిపింది.

    English summary
    Former Miss World prompted outrage on Twitter when she appeared in a controversial top on the cover of Condé Nast Traveller India
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X