జయలలిత జీవితంపై సినిమా: రామ్ చరణ్ హీరోయిన్‌తో!
ముంబై: బాక్సింగ్ క్రీడాకారిణి 'మేరీ కోమ్'పై చిత్రీకరిస్తున్న సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా.....దీని తర్వాత మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె పొలిటీషియన్ పాత్ర పోషిస్తుందని టాక్.
బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు మాధుర్ బండార్కర్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని, ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంతో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే.

ఇటీవల దర్శకుడు ఈ సినిమా ప్రతిపాదన ప్రియాంక చోప్రా ముందుకు తెచ్చాడని అంటున్నారు. ప్రియాంక చోప్రా కూడా డిఫరెంటుగా ఉండే ఈ సినిమాలో చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. 'మేడమ్ జీ' పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జయలలిత సినిమా జీవితం ఎలా సాగింది, ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎలా వెళ్లింది. ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? సినిమా జీవితంలో, రాజకీయ జీవితంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనబోతోంది అనే విషయాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











