సచిన్ రికార్డు బద్దలు కొట్టిన హాట్ హీరోయిన్!
మరో వైపు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ మంది అభిమానులు ఉన్న బాలీవుడ్ స్టార్‌గా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ప్రియాంక మొదటి స్థానంలో ఉండగా, శశిథరూర్ నెం.2 పొజిషన్లో ఉన్నారు. బాలీవుడ్ మోగాస్టార్ అమితాబ్ బచ్చన్ నెం.3 స్థానంలో ఉన్నారు. మొత్తం 100 మందితో కూడిన ఈ జాబితాలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు.
ఇక ప్రియాంక వ్యక్తిగత విషయాలకొస్తే....మీ పెళ్లి ఎప్పుడు? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడగ్గా...నాకు ఈడు జోడు అయిన మంచి మగాడు దొరకాలిగా అంటోంది. అంతే కాదు... అతను ఎప్పుడు దొరికితే, అప్పుడే పెళ్లి అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న 'బర్ఫీ' చిత్రంలో నటిస్తోంది.
మరో వైపు ఆమె నటించిన తేరీ మేరీ కహానీ చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు క్రిష్-3 చిత్రంలోనూ ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రియాంక ఇటీవల నటించిన డాన్ 2 చిత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. అగ్నిఫథ్ సినిమా మంచి విజయం సాధించినా...ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె పాత్రకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో హీరోయిన్ల రేసులో కరీనా, కత్రినా లాంటి వారితో వెకబడి పోయింది.


Click it and Unblock the Notifications












