సెక్స్ రాకెట్: ఖాళీ చేయాలని ప్రియాంక చోప్రా నోటీసులు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన బిల్డింగులో ఇటీవల హైటెక్ సెక్స్ రాకెట్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రాకు చెందిన బిల్డింగును రెంటుకు తీసుకుని స్పా పేరుతో అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పసిగట్టి దాడి చేసారు.

ఈ సంఘటనతో షాకైన ప్రియాంక చోప్రా.....వెంటనే తన ప్రాపర్టీని ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ‘తన ప్రాపర్టీలో ఇలాంటివి జరుగుతున్నాయనే విషయం తెలిసి షాకయ్యాను. మీరు కూడా ఎన్నో ప్రాపర్టీలు రెంటుకు ఇచ్చే ఉంటారు. కానీ అందులో వారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టమే. స్పా నడిపిస్తామని చెప్పి ఇలాంటివి చేస్తారని అస్సలు ఊహించలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు గురించి నాకు ఎక్కువగా తెలియదు. నా లాయర్ అన్నీ చూసుకుంటున్నారు' అని ప్రియాంక చోప్రా చెప్పింది.
తన ప్రాపర్టీని ఖాళీ చేయాల్సిందిగా ఇప్పటికే వారికి నోటీసులు పంపినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు. ఈ వ్యవహారంతో తాకు కాస్త డిస్ట్రబ్ అయ్యానని ప్రియాంక చోప్రా తెలిపారు.


Click it and Unblock the Notifications











