రామ్ చరణ్ సినిమాకు సైన్ చేసిన పిగ్గీ చోప్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన పిగ్గీ చోప్స్ అధికారికంగా ఖరారైంది. పిగ్గీ చోప్స్ అంటే ఎవరో కాదు... ప్రియాంక చోప్రానే. ఇది ఆవిడ నిక్ నేమ్. బ్లఫ్ మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఈ పేరు పెట్టారు. త్వరలో చరణ్, ప్రియాంక జంజీర్ సినిమాలో కలిసి నటించబోతున్నారు. బుధవారం ఉదయమే ఈ ప్రాజెక్టు ఆమె సైన్ చేసింది.
జంజీర్ చిత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.
జంజీర్ చిత్రం షూటింగ్ 13 మార్చి నుంచి మొదలుకానుంది. ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. చెర్రీ తొలి బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఈ చిత్రంలో ప్రియాంక జయాబచ్చన్ పోషించిన పాత్రను చేస్తుంది. యూఎస్ నుంచి తిరిగి వచ్చిన ఓ కేఫ్ ఓనర్‌గా ఆవిడ పాత్ర ఉంటుందని, ఇందులో ఆమె డ్రెస్సింగ్ చాలా గ్లామరస్‌గా, ఐటం భామలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంకోసం ప్రియాంక...హిందీ, తెలుగు వెర్షన్లకు కలిపి రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటదని సమాచారం.


Click it and Unblock the Notifications











