»   » చరణ్ హీరోయిన్ రూ. 50 లక్షల విరాళం

చరణ్ హీరోయిన్ రూ. 50 లక్షల విరాళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'జంజీర్' చిత్రంలో రామ్ చరణ్‌తో జోడీ కట్టిన హీరోయిన్ ప్రియాంక చోప్రా....ముంబై సబర్బన్‌లోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ వార్డు నిర్మాణం కోసం రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన తండ్రి అశోక్ చోప్రా జ్ఞాపకార్థం ఆమె ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా కొన్ని నెలల క్రితం క్యాన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే. తండ్రితో ఎంతో క్లోజ్‌గా ప్రియాంకకు ఆయన మరణం తీరని బాధను మిగిల్చింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌తో బాధపడే వారికి ఏదైనా సేవ చేసే భావనతో తండ్రి జ్ఞాపకార్థం క్యాన్సర్ వార్డు నిర్మాణానికి విరాళం ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ....'తండ్రి మరణం తనను ఎంతో కృంగదీసిందని, ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తండ్రి పేరుతో క్యాన్సర్ రోగులకు ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రియాంక తెలిపారు.

సదరు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కూడా ప్రియాంక చోప్రా హాజరు కాబోతున్నారు. ప్రియాంక చోప్రాను ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో ఫిజీషియన్‌గా సేవలు అందించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ సంవత్సరం జూన్ నెలలో మరణించారు.

English summary
Bollywood actress Priyanka Chopra has reportedly donated Rs 5 Million to build a cancer ward in a suburban hospital in Mumbai in the memory of her late father Ashok Chopra.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu