»   » షాక్ : న్యూడ్ ఎఫెక్టుతో రామ్ చరణ్ హీరోయిన్(ఫోటో)

షాక్ : న్యూడ్ ఎఫెక్టుతో రామ్ చరణ్ హీరోయిన్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ సరసన జంజీర్ రీమేక్ లో చేస్తున్న ప్రియాంక చోప్రా...దోస్తానా చిత్రం నాటి ఫీట్ ని మరో సారి రిపీట్ చేసింది. ఈ సారి ఆమె...'Exotic' అనే మ్యూజిక్ వీడియో కోసం న్యూడ్ కలర్ బికినీతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. దీని నిమిత్తం విడుదల చేసిన రెండో టీజర్ లో ఆమె ఇలా దర్శనమిచ్చింది. దాంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ఈ టీజర్ తో వచ్చింది.


ప్రియాంక చోప్రార నటించి జంజీర్ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు. జంజీర్ మరో వైపు 'జంజీర్' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి నిర్మాతలు మారినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్ర నిర్మాతగా ఉన్న అమిత్ మెహ్రా నుంచి ఈ చిత్రాన్ని ఆయన సోదరులు సుమీత్, పునీత్‌లు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు. ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు.

English summary
Bollywood's Badmaash Bubbly Priyanka Chopra's new single exotic's Teaser 2 is out now. PC was caught wearing a nude color bikini and posing with international star Pitbull.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu