ఆమెకు S.M.S లు పంపలేదు!

"మొత్తానికి నాకు బెయిల్ దొరికింది. అయితే ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్ధం కావటం లేదు. నిజానికి 2007 సెప్టెంబర్ ఇరవై మూడునే ప్రియాంక నా డ్యూ లన్ని క్లియర్ చేసేసింది. ఆ తరువాత మా ఇద్దరి మధ్యా ఏ విధమైన వివాదం లేదు. ఆ రోజు జరిగిన సెటిల్ మెంట్ ఎగ్రిమెంట్ లో రాసుకున్న దాని ప్రకారం మేం ఇద్దరం ఒకరిపై మరొకరు పరస్పరం పెట్టుకున్న కేసులను విత్ డ్రా చేసుకోవాలి. అది నేను చేసేసాను. బీజీ షెడ్యూల్ వల్లో మరెందుకో ఆమె అస్సలు పట్టించుకోలేదు.అంధేరీ కోర్టు నాపై ఆమె పెట్టిన కేసు అట్లానే ఉంది. అక్కడి మెజిస్ట్రేట్ నాకు వార్నింగ్ ఇచ్చాడు.
అందుకే నేను ప్రియాంకకు ఎస్.ఎమ్.ఎస్ లు ఇచ్చాను. అందులో నేను జైలుకెళ్ళి పదినెలలైంది దయ చూపమని. ఇక ఆమెను పెళ్ళి చేసుకుంటానంటూ నేను అడగటంలో అర్ధం లేదు. నేను ఓ కాశ్మీరీ అమ్మాయిని అప్పట్లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. నా పెద్ద కొడుకు వయస్సు ఇరవై ఏడు.వాడు ఎమ్.బి.ఎ చదువుతున్నాడు. అలాగే చిన్నబ్బాయి కి ఇరవై నాలుగేళ్ళు. వాడు సి.ఎ చదువుతున్నాడు. వాళ్ళకు పెళ్ళి సంభంధాలు వెతుకుతున్న ఈ దశలో నేను ప్రియాంకని పెళ్ళి చేసుకుంటానంటానా. ఇక నేను గతంలో హేమమాలిని,మాధురి,జయ ప్రద,శ్రీదేవి,మనీషా కొయిరాల,కత్రినా కైఫ్,సెలీన్,కొయినా,ఇషా డయోల్ వంటి వారు క్రింద పనిచేసారు.
ఇప్పటికి ఒక్కరు కూడా నా బిహేవియర్ పై కంప్లైంట్ చేయలేదు.ఎవరో మొత్తానికి నా ఇమేజ్ ని నాశనం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 'fakemailz.com" వంటి కొన్ని ఇంటర్ నేషనల్ సైట్ల సహకారంతో నా పేరు మీద నా నెంబర్ తో మెసేజ్ లు ఇచ్చారు. అయితే నేను కొన్ని ఎస్.ఎమ్.ఎస్ లు ఇచ్చానన్నది నిజం. వాటిల్లో అంధేరి కోర్టునుంచి నన్ను బయిట పడేయమని,అలాగే కొన్ని చెత్త సినిమాల్లో నటించవద్దని అంతకు మించి మరేమీ లేదని అంటున్నాడు". ఇక బాలీవుడ్ ఈ విషయమై ఏమీ స్పందించటం లేదు. ప్రియాంక ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











