సొమ్మసిల్లి పడిపోయిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సొమ్మసిల్లి పడిపోయింది. ముంబై పోలీస్ వార్షిక వేడుకల్లో పాల్గొనడానికి సిద్దం అవుతుండగా అమ్మడు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడి పోయింది. వెంటనే ఆమెను ఆర్గనైజర్లు సమీపంలోని క్లినిక్ కు తీసుకెళ్లారు. బిజీ షెడ్యూల్, అందాన్ని కాపాడుకోవడానికి పరిమితంగా తీసుకుంటున్న ఆహారం తదితర వల్ల ఆమె బ్లడ్ ప్రెషర్లో తేడాలొచ్చి మూర్చపోయినట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2009లోనూ ప్రియాంకకు ఇలానే జరిగింది. అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో 'వాట్స్ యువర్ రాశీ' అనే చిత్ర షూటింగులో కూడి ఇదే విధంగా పడి పోయింది. ప్రియాంక త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రియాంక ప్రస్తుతం హృతిక్ రోషన్ సరసన అగ్నిపథ్ చిత్రంతో పాటు, తేరీ మేరీ కహాని, బర్ఫీ, క్రిష్ 3 చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











