ప్రియాంక చోప్రా ఒకప్పుడు ఇలా ఉండేది (షాకింగ్ ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా...తాను కేవలం అందగత్తెను మాత్రమే కాదు, నటిని కూడా అని నిరూపించుకుంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికైంది.

కేవలం తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయింది. ఇప్పటికే పలు పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. అమెరికన్ టీవీ సీరిస్ లో నటించింది. దీంతో పాటు ప్రస్తుతం ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

బాలీవుడ్లో అందమైన హీరోయిన్ల టాప్ లిస్టులో ఉండే ప్రియాంక చోప్రా.... కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ రంగంలో చాలా కష్టపడింది. తనకంటే అందగత్తెలు ఆ ఫీల్డులో చాలా మంది ఉండటంతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి ప్రపంచ సుందరిగా సత్తా చాటింది.

మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ప్రియాంక చోప్రా లుక్ చూస్తే మీరు షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి ప్రియాంక చోప్రాకి, అప్పటి ప్రియాంక చోప్రాకి పోలికల్లో చాలా తేడా ఉంది. స్లైడ్ షోలో ప్రియాంక చోప్రా ఫస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు...

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్

అశోక్ చోప్రా, మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించింది. చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలిలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో మరియు ఐవాలోని సెదర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది.

చిన్నతనంలోనే వివిధ దేశాలు, ప్రాంతాలు

చిన్నతనంలోనే వివిధ దేశాలు, ప్రాంతాలు

ప్రియాంక తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు మరియు ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

మిస్ వరల్డ్ పోటీలు

మిస్ వరల్డ్ పోటీలు

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా జడ్జిలు ఆమెను జీవించిన ఉన్న వారిలో గొప్ప మహిళ ఎవరు? అని అడగ్గా....అందుకు సమాధానంగా మధర్ థెరిస్సా పేరు చెప్పింది. ప్రపంచ సుందరి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

నటనా రంగంలోకి...

నటనా రంగంలోకి...

తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది.

సింగింగ్ టాలెంట్

సింగింగ్ టాలెంట్

ప్రియాంక చోప్రా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందింది. ఇప్పటికే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేసింది.

ప్రియాంక చోప్రా ముద్దు పేరు

ప్రియాంక చోప్రా ముద్దు పేరు

మీడియాలో ప్రియాంక చోప్రాను....పీసీ, పిగ్గీ చాప్స్ అని పిలవడం మనం వింటూనే ఉన్నాం. కానీ ఆమె అసలు ముద్దు పేరు మిమి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X