Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రియాంకా చోప్రా ఎంత పని చేసావ్..! ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఇలా ముక్కు కోసుకుంది
హాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడ ముక్కు పై ఏదో కొత్తదనం కోసం ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్లాస్టిక్ సర్జరీ ఈ మాట మామూలుగా అప్పట్లో మైకేల్ జాక్సన్ అభిమానులకు మాత్రమే పరిచయం ఉన్నపదం, ఆతర్వాత కొన్ని సార్లు మెడికల్ జర్నల్స్ లో వచ్చిన వార్తల ద్వారా మరికొందరికి తెలిసింది... ఇక ఆతర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీని మామూలు జనానం లో కూడా ఎక్కువ పాపులర్ చేసింది మాత్రం టీవీ సీరియల్సే అనుకోండీ. సరే ఆవిషయం పక్కన పెడితే ఇలా ప్లాస్టిక్ సర్జరీలతో మొహం లో చిన్న మార్పులు చేసుకొని ఫేటు మార్చుకున్న వాళ్ళు చాలామందే కనిపిస్తారు. అయితే ఇలాంటి పనులవల్ల దెబ్బతిన్నవాళ్ళు చాలామందే ఉన్నారు...
శ్రీదేవి లాగే ముక్కు చెక్కించుకోబోయింది
ఉదాహరణకు శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి బాగానే ఉన్నాకూడా మరింత అందంగా కనిపించటానికి అంటూ ముక్కును సరిదిద్దుకోబోయి మొహం లో ఉన్న కాస్త అందాన్ని కూడా పోగొట్టుకొని అసలు నటనకే దూరం అయ్యింది, అదివరకు గులాబీ, మృగం లాంటి సినిమాల్లో నటించిన మహేశ్వరి హిందీలో కూడా దున్నేయాలనుకొని దానికి తగ్గట్టు శ్రీదేవి లాగే ముక్కు చెక్కించుకోబోయింది కానీ చెక్కటం కుదరక చెక్కుక్కు పోయిన ముక్కుతో తెరమీద మొహం చూపించలేక పోయింది.
అనుష్క శర్మా లిప్ సర్జరి
విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మా లిప్ సర్జరి చేసుకొని అందరి ముందు నవ్వులు పాలులైంది. అలానే పేరు మోసిన మోడల్ కోయినా మిత్ర కూడ దారుణంగా విఫలం అయ్యింది ఆ తరువాత కెరియర్ కూడ వదులుకోవలిసి వచ్చింది. లేటెస్ట్ గా "శూపర్" హీరోయిన్ ఆయేషా టకియా కూడా ఇలానే దెబ్బతినేసింది.
ప్రియాంకా చోప్రా
ఇప్పుడు హాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడ ముక్కు పై ఏదో కొత్తదనం కోసం ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక బాలీవుడ్ ప్రాజెక్టు కోసం ముంబయ్ వచ్చిన ఈ బ్యూటీ ఒక సెల్ఫి ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ట్రోల్ చేయడం మొదలుపెట్టారు
ఈ ఫోటోను అందరూ ఒకరకంగా పరీక్షించి చూసి ముక్కు దగ్గర తేడాను ఇటే గుర్తు పట్టేసి.. ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె అందం మార్చుకోవాల్సినంత తక్కువ అందమేమి కాదుకదా.. మరి నిజంగానే సర్జరీ చేయించుకుందా అంటే ఆమె లేటెస్త్ ఫొటోలు చూస్తే అర్థమైపోతోంది మరి.
అందం పాడుచేసుకొంది
నెటిజన్ల కామెంట్లను పరిశీలిస్తే.. "ప్రియాంకా చూడటానికి కొత్తగా ఉన్నా తన అందం పాడుచేసుకొంది" అని "కోయినా మిత్ర లాగా ప్రియాంకా కెరియర్ కూడ తప్పుదోవ పడుతుంది" అని కొందరు "ప్లాస్టిక్ 2 రూపీ గ్రామ్స్ ప్లీజ్" అని మరొకరు కామెంట్లు చేశారు. ఇక ఈ కొత్తముక్కు చెత్తగా ఉందంటూ జనాలు మాత్రం ముక్కువిరుస్తున్నారు.
|
హాలీవుడ్ లో కలిసిపోవటానికి
అయితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు ప్రియాంకా ఈ కామెంట్లనేం పట్టించుకోవటం లేదు. మొత్తానికి హాలీవుడ్ లో కలిసిపోవటానికి ఆ ఇండియన్ ముక్కుని అమెరికన్ స్టైల్ లోకి (ఆడవాళ్ళలో చిన్నగా ఉంది వెడల్పుగా ఉండవు వాళ్ళ ముక్కులు) మార్చేసుకుందన్నమాట.