»   »  న్యూడ్ డ్రెస్ విషయంలోనూ కాపీ కొట్టడమేనా పాప!

న్యూడ్ డ్రెస్ విషయంలోనూ కాపీ కొట్టడమేనా పాప!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరు. అంతే కాకుండా ఫ్యాషన్ పరంగా కూడా ఆమె ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఫ్యాషన్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈ సారి ఓ విషయంలో ప్రియాంక విమర్శలు ఎదుర్కొంటోంది. తన తాజా ఆల్బమ్ విషయంలో ఆమె ప్రఖ్యాత ఇంటర్నేషనల్ పాప్ స్టార్లను కాపీ కొట్టిందనే అపవాదు మూటగట్టుకుంటోంది.

  కేవలం నట, గ్లామర్ విషయంలో మాత్రమ కాదు....ఇప్పుడు పాటలు పాడటంలోనూ తన సత్తా చాటుతోంది. ఆమె తాజా ఆల్బమ్ 'ఎక్సోటిక్' వీడియో ఇటీవలే ఇంటర్నెట్లో విడుదలైంది. ప్రియాంక సింగింగ్ టాలెంట్‌కు పలువురి ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే ఆమె వీడియోలో ధరించిన డ్రెస్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె ధరించిన డ్రెస్ ఇంటర్నేషనల్ స్టార్స్ బ్రిట్నీ స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్, కాటీపెర్రీలు పలు సందర్భాల్లో వేసిన డ్రెస్సుల్లా ఉన్నాయని అంటున్నారు విమర్శకులు.

  ఈ వీడియోలో ప్రియాంక చోప్రా న్యూడ్ కలర్ చమ్కీ డ్రెస్ వేసింది. అయితే అలాంటి డ్రెస్ ఇంటర్నేషనల్ పాప్ స్టార్స్ పలు సందర్భాల్లో ఇప్పటికే ధరించారని అంటున్నారు. ఇలాంటి డ్రెస్‌లు మొదట ధరించింది ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్సేనని పలువురి వాద. ప్రియాంక వేసిన క్రిస్టల్స్ డ్రెస్ ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ పలు షోలలో వేసిందని అంటున్నారు. దీంతో డ్రెస్సింగ్ విషయంలో ప్రియాంక వారిని కాపీ కొట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  English summary
  After winning our hearts with her excellent acting skills, Priyanka Chopra went her own way to make a career in singing too. There was a lot of hype and talks over the actress's new album the 'Exotic' video, that got released on the internet recently. Though PC received good response for her singing in the video, the actress on the other hand received a lot of criticism for aping Britney Spears, Jennifer Lopez and Katy Perry in it.
 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more