»   »  ప్లాస్టిక్ ముక్కు ప్లాస్టిక్ పెదాలు: పాపం ట్రోలింగ్ దారుణం గా ఉంది

ప్లాస్టిక్ ముక్కు ప్లాస్టిక్ పెదాలు: పాపం ట్రోలింగ్ దారుణం గా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్లాస్టిక్ సర్జరీ ఈ మాట మామూలుగా అప్పట్లో మైకేల్ జాక్సన్ అభిమానులకు మాత్రమే పరిచయం ఉన్నపదం, ఆతర్వాత కొన్ని సార్లు మెడికల్ జర్నల్స్ లో వచ్చిన వార్తల ద్వారా మరికొందరికి తెలిసింది... ఇక ఆతర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీని మామూలు జనానం లో కూడా ఎక్కువ పాపులర్ చేసింది మాత్రం టీవీ సీరియల్సే అనుకోండీ. సరే ఆవిషయం పక్కన పెడితే ఇలా ప్లాస్టిక్ సర్జరీలతో మొహం లో చిన్న మార్పులు చేసుకొని ఫేటు మార్చుకున్న వాళ్ళు చాలామందే కనిపిస్తారు. అయితే ఇలాంటి పనులవల్ల దెబ్బతిన్నవాళ్ళు చాలామందే ఉన్నారు...

శ్రీదేవి లాగే ముక్కు చెక్కించుకోబోయింది

శ్రీదేవి లాగే ముక్కు చెక్కించుకోబోయింది

శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి బాగానే ఉన్నాకూడా మరింత అందంగా కనిపించటానికి అంటూ ముక్కును సరిదిద్దుకోబోయి మొహం లో ఉన్న కాస్త అందాన్ని కూడా పోగొట్టుకొని అసలు నటనకే దూరం అయ్యింది, అదివరకు గులాబీ, మృగం లాంటి సినిమాల్లో నటించిన మహేశ్వరి హిందీలో కూడా దున్నేయాలనుకొని దానికి తగ్గట్టు శ్రీదేవి లాగే ముక్కు చెక్కించుకోబోయింది కానీ చెక్కటం కుదరక చెక్కుక్కు పోయిన ముక్కుతో తెరమీద మొహం చూపించలేక పోయింది.

అనుష్క శర్మా లిప్ సర్జరి

అనుష్క శర్మా లిప్ సర్జరి

విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మా లిప్ సర్జరి చేసుకొని అందరి ముందు నవ్వులు పాలులైంది. అలానే పేరు మోసిన మోడల్ కోయినా మిత్ర కూడ దారుణంగా విఫలం అయ్యింది ఆ తరువాత కెరియర్ కూడ వదులుకోవలిసి వచ్చింది. లేటెస్ట్ గా "సూపర్" హీరోయిన్ ఆయేషా టకియా కూడా ఇలానే దెబ్బతినేసింది.

ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు

ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు

ఇప్పుడు హాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడ ముక్కు పై ఏదో కొత్తదనం కోసం ప్లాస్టిక్ సర్జరి చేసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక బాలీవుడ్ ప్రాజెక్టు కోసం ముంబయ్ వచ్చిన ఈ బ్యూటీ ఒక సెల్ఫి ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ముక్కు దగ్గర తేడా

ముక్కు దగ్గర తేడా

ఈ ఫోటోను అందరూ ఒకరకంగా పరీక్షించి చూసి ముక్కు దగ్గర తేడాను గుర్తు పట్టేసి.. ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముక్కు కు ప్లాస్టిక్ సర్జరి చేసుకుందిని అది వికటించి మరింత వికారంగా తయారైందిని అన్నారు. దానికి ప్రియాంకా ఇచ్చిన సమాధానం మరింత ఘాటుగా ఉంది.

ముక్కు పై ఇన్సూరెన్స్

ముక్కు పై ఇన్సూరెన్స్

నేను నా ముక్కుకు ఏమి చేయించుకోలేదు అయన నా ముక్కు పై ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నా మీకు అది తెలియదేమో అన్నది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకొంది ఈ ప్రపంచ సుందరి. తన సోషల్ మీడియా పేజ్ లో ఒక ఫోటో పెట్టింది. దానిలో ఆమె పెదాలలో ఏదో మార్పు ఉండటంతో

ప్లాస్టిక్ బ్యూటీ

ప్లాస్టిక్ బ్యూటీ

ప్రియాంకా పెదాలకు కూడా సర్జరి చేసుకుంది అని ఎవరికి వారే అనేసుకొని ప్లాస్టిక్ బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొద్ది రోజులు ముందు మన దేశ ప్రధానిని కలిసినప్పుడు సరైన దుస్తులు ధరించలేదు అని ఆమె పై అందరూ రాళ్ళు విసిరారు. అయితే ఇప్పుడు ఈమె పై వస్తున్న ప్లాస్టిక్ బ్యూటీ విమర్శ పై ఇంకా స్పందించలేదు అమ్మడు.

English summary
After being trolled for 'nose job' last time, Priyanka was slammed for her 'lip job' post her recent selfie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu