Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఫోటో: ప్రియాంక చోప్రా, ఇలియానా పార్టీలో ఎంజాయ్
హైదరాబాద్: ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలో కలిసి నటించిన సందర్భాలు అనేకం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇద్దరికి పడక పోవడం...లాంటి సందర్భాలే ఎక్కువ, స్నేహితులుగా కలిసి మెలిసి ఉండే హీరోయిన్లు చాలా తక్కువే అని చెప్పక తప్పదు. కానీ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మరో హరోయిన్ ఇలియానా మాత్రం ఎలాంటి మనస్పర్థలు లేకుండా స్నేహితుల్లా ఉంటున్నారు.
ప్రియాంక చోప్రా, ఇలియానా కలిసి రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'బర్ఫీ'లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమా తర్వాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. అది ఎంతగా అంటే కలిసి పార్టీల్లో పాల్గొనేంతగా..
ఇటీవల ప్రియాంక చోప్రా, ఇలియానా కలిసి తమ బాలీవుడ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఇలియానా తన ట్విట్టర్లో కూడా ఈ విషయాన్ని పేర్కొంది. దీనికి ప్రయాంక కూడా రిప్లై ట్వీట్ చేయడం గమనార్హం. సో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేమి కావాలి?
'దేవుడు చేసిన మనుషులు' తర్వాత తెలుగు సినిమా దూరంగా ఉంటున్న ఇలియానా....హిందీలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. 'హ్యాపీ ఎండింగ్', 'మే తేరా హీరో' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇక ప్రియాంక చోప్రా 'గుండే', మేరీ కామ్, జోయా అక్తర్ తర్వాతి సినిమాలకు కమిటైంది.