స్టార్ హీరోయిన్ కాలు జారితే ఆ హంగామానే వేరు...
జూనియర్ ఆర్టిస్టు మునిగి చనిపోయినా పట్టించుకోని ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాలు జారి క్రిందపడగానే పెద్ద హంగామా చేస్తోంది. బాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం తాను నటిస్తున్న 'అంజానా..అంజానీ..' షూటింగ్‌లో దెబ్బలు తగిలించుకుంది. సముద్రం ఒడ్డున రాళ్లపై నిలబడి నటించే సన్నివేశాన్ని థాయ్‌లాండ్‌లోని పట్టయాలో చిత్రీకరిస్తుండగా అదుపుతప్పి కిందపడింది. కాలు బెణకడం మినహా.. పెద్ద గాయమేమీ కాకపోవడంతో యూనిట్ అంతా ఊపిరి పీల్చుకున్నారు . అయితే దర్శకుడు,నిర్మాత మాత్రం రెస్ట్ తీసుకోవాల్సిందేనని పట్టుపట్టారు. ఈలోగా ఈ విషయం ఎలా బయిటకు వెళ్ళిందో ఎక్కడెక్కడి నుంచీ ఫోన్ లు. అంతేగాక మీడియా వారు కూడా క్షణాల్లో ఎంక్వైరీలు ప్రారంభించి...ఆమె ఆరోగ్యం కోసం ఆరా తీసారుట. దాంతో మొదట కాదనుకున్నా ఆమె ఆ పూటకు పేకప్ చెప్పాల్సి వచ్చిందిట. ఇక ప్రియాంకా చోప్రా ఇంతకు ముందు కూడా 'ద్రోణ' సినిమాలో కత్తియుద్ధం సీన్‌లో స్టంట్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే.ఇక ఈ హంగామా గూర్చి తెలుసుకున్న మిగతా హీరోయిన్స్ ఏంటీ కాస్త పట్టుతప్పి పడినందుకే ఇంత హడావిడా అని నోళ్ళు నొక్కుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











