ఆమె కి రామ్ చరణ్ తెలుగు క్లాస్ లు
రామ్ చరణ్ తాజాగా హిందీ చిత్రం జంజీర్ ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రాకు అతను తెలుగు నేర్పుతున్నాడు. ఆమె అతనికి హిందీ నేర్పుతోంది. అలా ఒకరికి ఒకరు క్లాసులు పెట్టుకుని ద్వి భాషా ప్రవీణులు అవుతున్నారు. ప్రియాంక చోప్రా తెలుగులో విడుదలయ్యే జంజీర్ కి డబ్బింగ్ తానే చెప్పుకుంటానంటోంది. మరో ప్రక్క రామ్ చరణ్ హిందీలో తానే వాయిస్ ఇస్తానంటున్నారు. ఇలా ఇద్దరూ లాంగ్వేజ్ లు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా పాత్రలు వివాహం కాకుండా సహజీవనం చేసే వ్యక్తులు. వీరి రొమాన్స్ ని దర్శకుడు అపూర్వ లఖియా వెండి తెర వేడిక్కేలా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ట్రెండ్ కి అణుగుణంగా అప్పటి జంజీర్ ని మార్చి మరీ తెరకెక్కిస్తూండటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అమిత్ మెహ్రా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో హాట్ రొమాన్స్ ఈ చిత్రంలోనే కనపడుతుందని అంటున్నారు.
ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్ ని తన కథకు ఎంపిక చేసుకోవటం గురించి చెపుతూ...నేను ఓ యంగ్ ,ఎనర్జీ ఉన్న యంగ్ హీరో కోసం వెతికాను. జంజీర్ కథ కోపంతో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ. ఈ రోజున బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసే యంగ్ హీరోలు లేరు. అంతా మెట్రో సెక్సువల్ హీరోలే అన్నారు. ఆ ఫైర్ రామ్ చరణ్ లో కనిపించింది. అందుకే అతన్ని కలిసి ఒప్పించుకున్నాను అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.


Click it and Unblock the Notifications











