»   » నెటిజన్లకు హెచ్చరిక, ఆ హీరోయిన్ వెరీ డేంజరస్

నెటిజన్లకు హెచ్చరిక, ఆ హీరోయిన్ వెరీ డేంజరస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సరసన 'తుఫాన్' చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వెరీ డేంజర్ సెలబ్రిటీ అని తేలింది. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా మోస్ట్ డేంజరస్ లిస్టులో ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్‌లో వీరి గురించి సెర్చ్ చేసే అభిమానులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారి కంప్యూటర్లలో ప్రమాదకర వైరస్ జొప్పించి వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని తేలింది.

ప్రమాదకరమైన సెలబ్రిటీల లిస్టులో గతేడాది ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి తొలిస్థానం ప్రియాంక చోప్రా దక్కించుకుంది. ఆమె తర్వాతి స్థానాల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సన్నీ లియోన్ ఉన్నారు.

మెకాఫే ఇండియా సెంటర్‌కు చెందిన వెంకటసుబ్రహ్మణ్యం ఈ ప్రమాదన కరమైన సెలబ్రిటీల టాప్ 10 లిస్టును ఇటీవల విడుదల చేసారు. కాబట్టి అభిమానులంతా ఇంటర్నెట్లో మీ అభిమాన తారలను గురించి సెర్చ్ చేసేటపుడు, వారికి సంబంధించిన ఫోటోలు చూసేప్పుడు, సమాచారం తెలుసుకునేప్పుడు ముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచింది. మీకు పరిచయం లేని వెబ్ సైట్ల జోలికి వెళ్లక పోవడం ఉత్తమం.

English summary
Priyanka knocked off Sunny Leone, who topped the list last year, but dropped to the ninth position this time, in the study by security software maker McAfee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu