»   » ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక చోప్రా (ఫోటోస్)

ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక చోప్రా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోసారి 'ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్'గా ఎంపికైంది. వరసగా నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు ఆమె ఈ టైటిల్ దక్కించుకోవడం విశేషం. లండన్ కు చెందిన 'ఈస్ట్రన్ ఐ' అనే వారపత్రిక సోషల్ మీడియా ద్వారా నిర్వహించిన పోల్ లో ఎక్కువ మంది ప్రియాంక చోప్రాకు ఓటే వేసారు. 50 మందితో కూడిన టాప్ లిస్టులో ఈస్ట్రర్న్ ఐ శుక్రవారం విడుదల చేసింది.

మరోసారి తనకు సెక్సియెస్ట్ ఉమోన్ టైటిల్ దక్కడంపై ప్రియాంక చాలా సంతోషం వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, అలాగే దీనిని నిర్వహించిన ఈస్ట్రన్ ఐ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. తాను మళ్లీ ఘనతను దక్కించుకోవడం ఆనందంగా, నాకు సెక్సీ టైటిల్ దక్కడానికి కారణమైన ఐస్టర్న్ ఐ వారికి కూడా థాంక్స్ అని చెప్పారు.

మొత్తం 50 మంది మహిళలతో తయారు చేసిన ఈ జాబితాలో తొలి స్థానం ప్రియాంక చోప్రా దక్కించుకోగా.... ఇతర బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకోన్ 4వ స్థానం, కత్రినా కైప్ 5వ స్థానం, టెలివిజన్ నటి నియా శర్మ 6వ స్థానం, కరీనా కపూర్ 7వ స్థానం, గెహర్ ఖాన్ 8వ స్థానం, సోనమ్ కపూర్ 9వ స్థానం... పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ 10వ స్థానం దక్కించుకుంది.

48 సంవత్సరాల వయసున్న మాధురి దీక్షిత్ కూడా ఈ లిస్టులో 44వ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో ఈవిడే అత్యధిక వయస్కురాలు. అతి చిన్న వయసు 20 సంవత్సాల రాధిక మదాన్ 24వ స్థానంలో నిలిచింది. శ్రద్ధా కపూర్ 19వ స్థానంలో, బిపాసా బసు 25వ స్థానంలో, అలియా భట్ 27వ స్థానంలో, పరినీతి చోప్రా 33వ స్థానంలో, మెహ్రీన్ సయూద్ 38వ స్థానంలో, కనికా కపూర్ 48వ స్థానంలో నిలిచింది.

స్లైడ్ షోలో ప్రియాంక చోప్పాకు సంబంధించిన ఫోటలు, వివరాలు...

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్

2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

నటనా రంగంలోకి...

నటనా రంగంలోకి...

తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది.

నటనా రంగంలోకి...

నటనా రంగంలోకి...

తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది.

సింగింగ్ టాలెంట్

సింగింగ్ టాలెంట్

ప్రియాంక చోప్రా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందింది. ఇప్పటికే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేసింది. త్వరలో రాబోతున్న ‘మేరీ కోమ్' చిత్రంలో కూడా ఓ పాట పాడబోతోంది.

 ప్రియాంక చోప్రా ముద్దు పేరు

ప్రియాంక చోప్రా ముద్దు పేరు

మీడియాలో ప్రియాంక చోప్రాను....పీసీ, పిగ్గీ చాప్స్ అని పిలవడం మనం వింటూనే ఉన్నాం. కానీ ఆమె అసలు పెట్ నేమ్ మిమి.

ప్రపంచ సుందరి

ప్రపంచ సుందరి

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా మరియు ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

 మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్

మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్

డాన్, ద్రోణా, మేకీ కోమ్ లాంటి యాక్షన్ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందింది.

ఫ్యామిలీ రిలేషన్స్

ఫ్యామిలీ రిలేషన్స్

ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా సినిమా రంగంలో హీరోయిన్‌గా రాణిస్తోంది. మరో కజిన్ మీరా చోప్రా తెలుగులో బంగారం చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించింది.

లక్షలాది మంది పాలోవర్స్

లక్షలాది మంది పాలోవర్స్

ప్రియాంక చోప్రాకు ట్విట్టర్లో ఏకంగా 65 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్లలో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రానే టాప్.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...

సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రియాంకకు 5 లక్షల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.

కార్ కలెక్షన్

కార్ కలెక్షన్

ప్రియాంక చోప్రా వద్ద పోర్షే కారుతో పాటు, బిఎండబ్ల్యు 7 సిరీస్, మెర్సిడెస్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్

నేషనల్ అవార్డ్ విన్నర్

ఫ్యాషన్ సినిమాలో పోషించిన పాత్రకు గాను ప్రియాంక చోప్రా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

 జంక్ ఫుడ్ బాగా...

జంక్ ఫుడ్ బాగా...

ప్రియాంక చోప్రాకు జంక్ ఫుడ్ బాగా తినే అలవాటు ఉందట. అయినా ఆమె బాడీ అంత అందంగా ఉండటం ఆమె స్నేహితులను ఆశ్చర్య పరుస్తుంది.

వర్కౌట్స్ కూడా చేయదు...

వర్కౌట్స్ కూడా చేయదు...

ప్రియాంక చోప్రా ఇంత సన్నగా ఉంది కదా...రోజూ వ్యాయామం చేస్తూ తెగ కష్టపడుతుందనుకుంటే పొరపాటే. అసలు అలాంటి అలవాటే ఆమెకు లేదట.

అకాడమిక్ ఇంట్రెస్ట్స్

అకాడమిక్ ఇంట్రెస్ట్స్

మోడలింగ్, సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక చోప్రా ఇంజనీర్ అవ్వాలనుకుంది.

 బాలీవుడ్లో సెటిలైంది

బాలీవుడ్లో సెటిలైంది

బాలీవుడ్లో వెల్ సెటిల్డ్ యాక్టర్లలో ప్రియాంక చోప్రా ఒకరు. బర్ఫీ, మేరీ కోమ్ లాంటి నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఆమె నటించింది.

ఐటం నెంబర్స్ కూడా...

ఐటం నెంబర్స్ కూడా...

ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. ‘రామ్ లీలా' చిత్రంలో ప్రియాం చోప్రా చేసిన ఐటం సాంగ్ అదుర్స్.

 ఫేవరెట్ చిత్రం

ఫేవరెట్ చిత్రం

ప్రియాంక చోప్రాకు బాగా నచ్చిన చిత్రం ‘దిల్ వాలె దుల్హనియా లే జాయేంగే'.

ప్రియాంక అఫైర్స్

ప్రియాంక అఫైర్స్

బాలీవుడ్లో అఫైర్స్ అనేవి సాధారణమే. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి వారితో ప్రియాంక అఫైర్స్ నడిపినట్లు వార్తలు వినిపించాయి.

English summary
Bollywood star Priyanka Chopra beat off global competition to retain her title as the Sexiest Asian Woman in an annual UK poll. The singer and actress, 33, came out on top following millions of votes pouring in from across the globe on social media for the 2015 edition of the popular'50 Sexiest Asian Women.
Please Wait while comments are loading...