ఆ స్టార్ హీరోయిన్ మిస్ వరల్డ్ పోటీకి జడ్జిగా..
దాదాపు తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా తిరిగి మిస్ వరల్డ్ పోటీలకు వెళ్తోంది. అయితే ఈ సారి వెళ్లేది పోటీలో పాల్గోనటానికి కాదు..ఆ పోటీని పర్యవేక్షించి మార్కులు వేసే జడ్జిగా వెళ్తోంది. ఇందు నిమిత్తం మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బెర్గ్‌లో జరిగే పోటీలకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ఆమె మీడియాతో చెపుతూ...పోటీల ఇన్‌చార్జి జూలియా మోర్లీ తనను ఆహ్వానించగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని, అప్పట్లో టీనేజర్‌గా ఉన్న తాను చాలా భయంభయంగా స్టేజిమీదకు వెళ్లానని, ఇపుడు పూర్తి భిన్నమైన పాత్రలో ఉండబోతున్నాని ప్రియాంక చెప్పింది. ఇక ఈ 2009 సంవత్సరం తనకు నటిగా బాగా కలిసి వచ్చిందని ఆనందోత్సాహాలతో చెప్తోంది. 2010 జనవరిలో ఆమె నటించిన ప్యార్ ఇంపాజిబుల్ రిలీజ్ కానుంది. 2000వ సంవత్సరంలో ఆమె మిస్ వరల్డ్ టైటిల్ కు ఎంపికైంది. ఫ్యాషన్ చిత్రానికి గానూ ఆమె పిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డుకు ఎంపికైంది.


Click it and Unblock the Notifications











