ఫ్యాషన్ బ్యూటీ: ప్రియాంక చోప్రా లుక్ అందిరింది (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎక్కడికి వెళ్లినా స్టైలిష్ లుక్‌తో అదరగొడుతూ ఉంటుంది. తాజాగా ఆదివారం ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అమ్మడు అదరగొట్టింది. 'కంఫర్టబుల్' పేరుతో ప్రముఖ డిజైనర్ వరుణ్ భాల్ డిజైన్ చేసిన దుస్తులు ధరించిన ప్రియాంక సభికులను సమ్మోహన పరిచింది.
బ్లాక్ పైజామా ప్యాంట్, సేమ్ షేడ్ క్రాఫ్ టామ్, స్టైలిష్ హెయిర్డో, హెవీ నెక్ పీస్ ధరించిన ర్యాంప్‌పై హొయలు ఒలికించిన ప్రియాంక చోప్రా రావిషింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. వరుణ్ భాల్ డిజైన్స్‌కు ప్రియాంక చోప్రా మరింత వన్నె తెచ్చి పెట్టింది. షో మొత్తానికి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ...'నార్మల్‌గా ఉండే దుస్తులు అంటేనే నాకు ఇష్టం. ఫ్యాన్సీ దుస్తులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. వరుణ్ భాల్ డిజైన్ చేసిన ఔట్ ఫిట్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చారు. స్లైడ్ షోలో ఫ్యాషోకు సంబంధించిన ఫోటోలు...

ప్రియాంక చోప్రా
ఈ ఫ్యాషన్ షోలో ప్రియాంక చోప్రా న్యూ లుక్ తో డిపరెంటుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన సెల్పీ ఫోటోను ప్రియాంక చోప్రా తన ట్విట్టర్లో పోస్టు చేసింది.

పీ..సీ
ఈ ఫ్యాషన్ షోలో ప్రియాంక చోప్రా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించింది.

ప్రియాంక
ప్యాషన్ షోలో ప్రియాంక చోప్రా ధరించిన దుస్తులను ఇక్కడ కనిపిస్తున్న చూడొచ్చు.

డిజైనర్‌తో..
డిజైనర్ వరుణ్ బాల్‌తో కలిసి ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ చేసింది.


Click it and Unblock the Notifications











