టీవీ నటుడితో రామ్ చరణ్ హీరోయిన్ పెళ్లి
ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ మూవీ 'జంజీర్'లో నటిస్తున్న ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లికి రెడీ అవుతోంది. బాలీవుడ్ నుంచి అందుతున్న వివరాల ప్రకారం ఆమె హిందీ టెలివిజన్ నటుడు మోహిత్ రైనాను పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ టీవీ సీరియల్ 'మహదేవ్'లో శివుని పాత్ర చేసిన మోహిత్ రైనా బాగా పాపులర్ అయ్యాడు.
మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని మీడియా వారు ప్రియాంక చోప్రాను ప్రశ్నించిన ప్రతిసారి నేను సింగిల్‌గానే ఉన్నాను, నాకు తగిన జోడీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సమాధానం ఇస్తూ వస్తోంది. తోడు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యాలను ప్రియాంక కుటుంబ సభ్యులు సీరియస్ గా తీసుకున్నారు.
హిందీ ఛానల్ జూమ్ కథనం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులు టీవీ నటుడు మోహిత్ రైనాతో ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోవడంపై మోహిత్ రైనా కూడా చాలా ఇంట్రెస్టు చూపుతున్నాడట. మరి ప్రియాంక అభిప్రాయం ఏమిటో ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనా ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
ఇక రామ్ చరణ్-ప్రియాంక కలిసి నటిస్తున్న 'జంజీర్' చిత్రం విషయానికొస్తే.... ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమితాబ్, జయా బచన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈచిత్రం ఒకే సారి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











