మతి పోగొట్టే రేంజిలో హీరోయిన్ ప్రియాంక రాయల్ వెడ్డింగ్ (లేటెస్ట్ ఫోటోస్)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌తో వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్, డిసెంబర్ 2న హిందూ స్టైల్ మ్యారేజ్ జరిగింది. హిందూ స్టైల్ వెడ్డింగుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తాజాగా విడుదల చేశారు.
రాయల్ వెడ్డింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా వైభవంగా ఈ వివాహ మహోత్సవం జరిగినట్లు స్పష్టం అవుతోంది. అభిమానుల మతి పోగొట్టే విధంగా ఉన్న ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

అత్తింటి వారితో ప్రియాంక చోప్రా
ఇండియన్ స్టైల్ వెడ్డింగ్ అనంతరం భర్త నిక్ జొనాస్, అత్తారింటివారితో కలిసి ప్రియాంక చోప్రా. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో నిక్ కుటుంబం దగదగ మెరిసిపోయారు.

అందంగా మెరిసిపోయిన ప్రియాంక
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు డ్రెస్సులో ప్రియాంక మహారాణిలా మెరిసిపోయింది. ఆమె ఎప్పుడూ కనపడనంత అందంగా కనిపించింది అంటూ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సూపర్ జోడీ
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ జోడీ అదిరిపోయింది... చూడముచ్చటైన జంట అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నూతన జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ దర్శనమిస్తున్నాయి.

ఫుల్ ఫన్
ఇండియన్ స్టైల్ వెడ్డింగులో పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత వధువు, వరుడు పూలమాల మార్చుకునే సందర్భంలో జరిగే ఫన్ అంతా ఇంతా కాదు. ఎంతో వినోదాత్మకంగా జరిగే ఈ తంతులో ప్రియాంక, నిక్ దంపతులు బాగా ఎంజాయ్ చేశారు.

రాకుమారిని తీసుకొచ్చినట్లు...
రాకుమారిని తీసుకొచ్చినట్లుగా ప్రియాంకను పెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

వైభవంగా వివాహం
డిసెంబర్ 1, 2 తేదీల్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్‌భవన్‌లో వీరి పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఢిల్లీలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. త్వరలో అమెరికాలో మరో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరుగబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











