ఆ ఫోటోలను ప్రియాంక చోప్రా రూ. 18 కోట్లకు అమ్మేసిందట!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, హాలీవుడ్ నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 2న జోధ్‌పూర్‌లో జరుగబోతోంది. అయితే పెళ్లి జరిగిన వెంటనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు చూడాలని ఆశపడే అభిమానులకు నిరాశే అని చెప్పక తప్పదు. వీటి రైట్స్ ఓ మేగజైన్‌కు అమ్మేశారట.
జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ భవన్ ప్యాలెస్‌లో హిందు, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకలో ఎంపిక చేసిన కొంత మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం.

రూ. 18 కోట్లకు అమ్మేశారు
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం...ప్రియాంక, నిక్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ రైట్స్ ఓ ఇంటర్నేషనల్ మేగజైన్‌కు రూ. 2.5 మిలియన్ డాలర్లకు అమ్మేశారట. అంటే మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 18 కోట్లు. ఇద్దరూ ఇంటర్నేషనల్ స్టార్సే కావడంతో ఇంత భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఆ డబ్బును ఏం చేస్తారు?
ఫోటోస్ రైట్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ చారిటీ కార్యక్రమాల కోసం వినియోగించే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

కట్టుదిట్టమైన భద్రత
కట్టుదిట్టమైన భద్రత మధ్య పూర్తి ప్రైవేట్ సెర్మనీగా ప్రియాంక-నిక్ వివాహం జరుగనుంది. ఇరు కుటుంబాలకు చెందిన వారితో కలిపి మొత్తం 200 మంది మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది.

ముంబైలో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇది ముంబైలో ఉంటుందా? అమెరికాలో ఉంటుందా? అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రియాంక చోప్రా బ్రైడల్ షవర్, బ్యాచిలర్ పార్టీ అమెరికాలో జరుపుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











