వెంకటేష్ సరసన ప్రియాంక చోప్రా?

అయినా తెలుగు సినిమాల్లో హిందీ తారలు చేయటం కొత్తేమి కాదు. దాదాపు ప్రతీ తెలుగు సినిమాలోనూ అది జరిగేదే. ఎందుకంటే హిందీ తర్వాత ఎక్కువ చిత్రాలు నిర్మించేది తెలుగు పరిశ్రమే అందులోనూ మనవాళ్ళు పారితోషికం విషయంలో కూడా ముంబాయి తారలంటే వెనకడుగు వేయకండా అడిగినంత ఇస్తారు. అందువల్ల అక్కడ క్రేజి హీరోయిన్లు తెలుగు సినిమాలు పట్ల మక్కువ చూపెడుతున్నారు. అయినా తెలుగులో పెద్ద హీరో అయిన వెంకటేష్ ప్రక్కన నటించే అవకాశం రావటం ప్రియాంకకు సంతోషకరమైన విషయమే.అందులోనూ క్రిష్ లాంటి ప్రితిభ ఉన్న దర్శకుడు చేతిలో పడటం మరో ఆలోచన లేకుండా ఎవరైనా ముందుకెళ్ళే విషయమే.కాబట్టి ఈ చిత్రం ఓ.కె అయితే ఆమె తెలుగు సినిమా కోరికా తీరుతుంది. మరో మరో ముంబాయి ముద్దుగుమ్మ అందాలు ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకూ దొరికినట్లవుతుంది.


Click it and Unblock the Notifications











