»   » రాత్రంతా ఆ హీరోతో గడిపిన ప్రియాంక చోప్రా... (ఫోటోస్)

రాత్రంతా ఆ హీరోతో గడిపిన ప్రియాంక చోప్రా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటు బాలీవుడ్ సినిమాలు, అటు హాలీవుడ్ ప్రాజెక్టులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా..... రెండు రోజుల క్రితమే(ఏప్రిల్ 22) అమెరికా నుండి ఇండియా తిరిగి వచ్చింది. ముంబైలో ఇలా ల్యాండ్ అయిందే ఆలస్యం....అదే రోజు పార్టీ మూడ్ లోకి వెళ్లి పోయింది.

తన బాలీవుడ్ ఫ్రెండ్, గుండే మూవీ కోస్టార్ రణబీర్ సింగ్, మరికొందరు ఫ్రెండ్స్ తో కలిసి రాత్రంత పార్టీ ఎంజాయ్ చేసారు. శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుఝాము వరకు ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ పార్టీలో ఎవరెవరు?

ఈ పార్టీలో ఎవరెవరు?

ఈ పార్టీలో రణవీర్ సింగ్‌తో పాటు జోయా అక్తర్, డైరెక్టర్ హోమి అడజనియా, నిత్యా మెహ్రా, ఫోటోగ్రాఫర్ అభీత్ గిడ్వానీ తదితరులు పాల్గొన్నారు.

ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక

ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

బాలీవుడ్లో తగ్గిన సినిమాలు

బాలీవుడ్లో తగ్గిన సినిమాలు

ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ప్రియాంక చోప్రా సినిమాలు బాగా తగ్గిపోయాయి. అమ్మడు అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో'తో పాటు, హాలీవుడ్ మూవీ ‘బేవాచ్'లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం.

ఇంకా క్లారిటీ లేదు

ఇంకా క్లారిటీ లేదు

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఏ ప్రాజెక్టుకు అఫీషియల్ గా కమిట్ కాలేదు. అటు హాలీవుడ్లో, ఇటు బాలీవుడ్లో ఇంకా కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. త్వరలో తన తర్వాతి ప్రాజెక్టుల గురంచి ప్రియాంక అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. కల్పానా చావ్లా బయోపిక్ లో ప్రియాంక నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Priyanka Chopra parties with Gully Boy Ranveer Singh, praises his ‘rhyme game’. See pics
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X