ప్రియాంక చోప్రా మానసిక రోగి..మరి ఇలియానా సంగతేంటి

By Srikanya

స్టార్ హీరోయిన్ ఇలియానా నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం 'బర్ఫీ'. అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ మూగ, చెవిటి యువకుడిగా నటిస్తున్నాడు. అతని సరసన ప్రియాంకా చోప్రా కనిపించనుంది. ప్రియాంక ఇందులో మతి స్థిమితం సరిగా ఉండని యువతి పాత్ర చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..."ఈ పాత్ర పోషణ కాస్త క్లిష్టమైనదనే చెప్పాలి. కేరికేచర్‌కీ, వాస్తవానికీ మధ్య ఉన్న రేఖ చాలా పలుచనిది. ఇంతవరకు నేను చేసిన పాత్రలన్నింటిలోనూ ఈ పాత్ర చేయడం ఓ సవాలు వంటిది'' అని ఆమె తెలిపింది. ఈ పాత్ర పోషణ కోసం ఆమె ఓ మానసిక వైద్య చికిత్సాలయంను సందర్శించి, అక్కడి రోగుల్ని పరిశీలించింది. అలాగే ఈ చిత్రం సెట్స్ మీద తన పాత్రని ఆమె సరిగ్గా చేసేందుకు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూనిట్ సభ్యుల్లో అతికొద్ది మందిని తప్పితే ఇతరులెవరూ అక్కడకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ చిత్రంలో ఇలియానా ఏమి పాత్ర చేస్తోంది అంటే... రణబీర్, ప్రియాంకల కథ చెప్పే ఓ అమ్మాయిగా ఆమె కనిపించనున్నదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X