»   » ప్రియాంక చోప్రాకు దాదా ఫాల్కే అకాడమీ అవార్డ్

ప్రియాంక చోప్రాకు దాదా ఫాల్కే అకాడమీ అవార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌కు అంతర్జాతీయ ప్రతీకగా నిలిచినందుకు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 1న ఆమె ముంబైలో ఈ అవార్డును అందుకోనున్నారు.

దాదా ఫాల్కే అకాడమీ అవార్డుల్లో ఇటీవలే కొత్తగా ప్రవేశ పెట్టిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి విభాగంలో ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హాలీవుడ్ సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్నందుకుగాను ఆమెకు ఈ అవార్డు అందజేసారు.

Priyanka Chopra To Receive Dadasaheb Phalke Academy Award

ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికోతో పాటు.... హాలీవుడ్ మూవీ 'బేవాచ్'లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చెప్రా పని తీరుతో దేశం గర్వించేలా ఉందని, అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ, అవార్డు కమిటీ చైర్మన్ గణేశ్‌జైన్ తెలిపారు.

జానీ లివర్, పహ్లజ్ నిహ్లానీ, మిథున్ చక్రవర్తి, టీపీ అగర్వాల్ తదితరులతో కూడిన ఈ కమిటీ ప్రియాంక చోప్రాను ఏకగ్రీవంగా ఈ అవార్డుకు ఎంపిక చేసారు. జూన్ 1న జరిగే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

English summary
Actress Priyanka Chopra will be conferred with the Dadasaheb Phalke Academy Award for being an international icon, reports news agency PTI.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu