ఆసియా శృంగార మహిళగా ప్రియాంక చోప్రా (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా వరల్డ్ సెక్సియెస్ట్ ఆసియన్ ఉమెన్‌గా ఎంపికైంది. యూనైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన ప్రముఖ వీక్లీ ‘ఈస్ట్రన్ ఐ' నిర్వహించిన సర్వేలో ఆమె ఎక్కువ ఓట్లు దక్కించుకుని మొదటి స్థానం దక్కించుకుంది.
గత ఏడాది సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ టైటిల్ దక్కించుకోగా.......ఈ సారి ప్రియాంక చోప్రా దక్కించుకుంది. మొత్తం 50 మంది బ్యూటీస్ పోటీ పడగా ప్రియాంక మొదటి స్థానంలో, ప్రముఖ టీవీ నటి ద్రష్టి ధామి రెండో స్థానం దక్కించుకుంది. కత్రినా కైఫ్ ఈ సారి 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
‘ఆసియా సెక్సియెస్ట్ ఉమెన్'గా ఎంపిక కావడంపై ప్రియాంక చోప్రా చాలా సంతోషంగా ఉంది.... ప్రియాంక చోప్రా గురించిన ఇతర హాట్ విషయాలు, ఫోటోలు స్లైడ్ షోలో.

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్
అశోక్ చోప్రా మరియు మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో చోప్రా జన్మించింది. చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలిలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో మరియు ఐవాలోని సెదర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది. ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు మరియు ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది. ఆమెకు ఆమెకంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు.

మిస్ ఇండియా టైటిల్
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

నటనా రంగంలోకి...
తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది.

బాలీవుడ్ ఎంట్రీ
అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది.

సింగింగ్ టాలెంట్
ప్రియాంక చోప్రా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందింది. ఇప్పటికే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేసింది. త్వరలో రాబోతున్న ‘మేరీ కోమ్' చిత్రంలో కూడా ఓ పాట పాడబోతోంది.

ప్రియాంక చోప్రా ముద్దు పేరు
మీడియాలో ప్రియాంక చోప్రాను....పీసీ, పిగ్గీ చాప్స్ అని పిలవడం మనం వింటూనే ఉన్నాం. కానీ ఆమె అసలు పెట్ నేమ్ మిమి.

ప్రపంచ సుందరి
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా మరియు ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్
డాన్, ద్రోణా, మేకీ కోమ్ లాంటి యాక్షన్ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందింది.

ఫ్యామిలీ రిలేషన్స్
ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా సినిమా రంగంలో హీరోయిన్‌గా రాణిస్తోంది. మరో కజిన్ మీరా చోప్రా తెలుగులో బంగారం చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించింది.

లక్షలాది మంది పాలోవర్స్
ప్రియాంక చోప్రాకు ట్విట్టర్లో ఏకంగా 65 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్లలో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రానే టాప్.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...
సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రియాంకకు 5 లక్షల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.

కార్ కలెక్షన్
ప్రియాంక చోప్రా వద్ద పోర్షే కారుతో పాటు, బిఎండబ్ల్యు 7 సిరీస్, మెర్సిడెస్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్
ఫ్యాషన్ సినిమాలో పోషించిన పాత్రకు గాను ప్రియాంక చోప్రా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

జంక్ ఫుడ్ బాగా...
ప్రియాంక చోప్రాకు జంక్ ఫుడ్ బాగా తినే అలవాటు ఉందట. అయినా ఆమె బాడీ అంత అందంగా ఉండటం ఆమె స్నేహితులను ఆశ్చర్య పరుస్తుంది.

వర్కౌట్స్ కూడా చేయదు...
ప్రియాంక చోప్రా ఇంత సన్నగా ఉంది కదా...రోజూ వ్యాయామం చేస్తూ తెగ కష్టపడుతుందనుకుంటే పొరపాటే. అసలు అలాంటి అలవాటే ఆమెకు లేదట.

అకాడమిక్ ఇంట్రెస్ట్స్
మోడలింగ్, సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక చోప్రా ఇంజనీర్ అవ్వాలనుకుంది.

బాలీవుడ్లో సెటిలైంది
బాలీవుడ్లో వెల్ సెటిల్డ్ యాక్టర్లలో ప్రియాంక చోప్రా ఒకరు. బర్ఫీ, మేరీ కోమ్ లాంటి నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఆమె నటించింది.

ఐటం నెంబర్స్ కూడా...
ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. ‘రామ్ లీలా' చిత్రంలో ప్రియాం చోప్రా చేసిన ఐటం సాంగ్ అదుర్స్.

ఫేవరెట్ చిత్రం
ప్రియాంక చోప్రాకు బాగా నచ్చిన చిత్రం ‘దిల్ వాలె దుల్హనియా లే జాయేంగే'.

ప్రియాంక అఫైర్స్
బాలీవుడ్లో అఫైర్స్ అనేవి సాధారణమే. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి వారితో ప్రియాంక అఫైర్స్ నడిపినట్లు వార్తలు వినిపించాయి.


Click it and Unblock the Notifications











