ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ అడుగుతున్నారు
ముంబయి: 'మేరికోమ్'... ప్రియాంకా చోప్రా ప్రాణాలన్నీ పెట్టి నటించిన చిత్రం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రియాంక ట్రైలర్ లు విడుదలై బాలీవుడ్‌లో ఆసక్తి రేపింది. ఇప్పుడీ చిత్రానికి టాక్స్ ఫ్రీ అడుగుతున్నారు. గతంలో ఇలాంటి చిత్రాలకు టాక్స్ ఫ్రీ ని కొన్ని రాష్ట్రాలు ఇవ్వటంతో నిర్మాతలు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
బాక్సర్ మేరీకోం పాత్రలో నటిస్తున్న ప్రియాంకా చోప్రా ఆ సినిమా తాను ఉచితంగానే చేసేదాన్నన్నారు. డబ్బు ముఖ్యం కాదని, మంచి పని తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రతి చిత్రంలోనూ తాను పోషించే పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడతానని ఆమె చెప్పారు. తనకు ప్రతి సినిమా ఒక మొగల్‌ఎ ఆజం లాంటిదేనని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.
మేరీకోం చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకూ మేరీకోంకు పోలికలున్నాయన్నారు. పెంపకంలో, పురుషప్రధాన వృత్తుల్లో మహిళలుగా జీవితాన్ని ఎదుర్కొన్న తీరులో... పోలికలున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. మేరీకోం జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

ప్రియాంక మాట్లాడుతూ ''బాగ్ మిల్కా బాగ్'తో ఈ చిత్రాన్ని పోల్చలేం. ఎందుకంటే ఓ క్రీడాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. క్రీడా చిత్రాల్లో ఓ ట్రెండ్ అనడం ఈ చిత్రాన్ని అగౌరవపరచడమే. దేశం గర్వించదగ్గ చిత్రం'' అని చెప్పింది.
అలాగే...ఈ చిత్రం ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.
ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఒమాంగ్ కుమార్.


Click it and Unblock the Notifications











