»   » పిల్లల్ని కనడానికే మగాడితో జతకడతాను (హీరోయిన్ ఇంటర్వ్యూ)

పిల్లల్ని కనడానికే మగాడితో జతకడతాను (హీరోయిన్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పిల్లలను కనడానికి తప్ప మరే విషయంలోనూ తనకు మగాడి అవసరం, సహాయం అవసరం లేదని తేల్చిచెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చెప్రా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్లోనూ రాణిస్తున్న అమ్ముడు ఓ ఎన్ఆర్ఐ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డేటింగ్ వార్తలపై ఆమె స్పందిస్తూ...అవన్నీ ఆధారం లేని వార్తలే అని కొట్టి పారేసారు. ప్రేమ గురించి, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

అసలు తనకు మగాడి అవసరమే లేదని, కేవలం పిల్లలు కనడానికి తప్ప... మరే విషయంలోనూ అవసరం లేదని తెలిపింది. డబ్బులు, వజ్రాలు, ఇళ్లు, కార్లు వంటి విలువైన బహుమతులు కోసం బాయ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేయాల్సిన అగత్యం తనకు లేదని తేల్చి చెప్పింది.

నాకు పిల్లలంటే చాలా ఇష్టం. చాలా మంది పిల్లలను కనాలని ఉంది. అందుకోసం మాత్రమే నాకు మగాడు అవసరం. జీవితంలో నేను నా సొంత కష్టంతో ఎదిగాను. నాకు అవసరం అయినవన్నీ నాకు నేను కొనుక్కోగలిగాను. నా జీవితంలోకి మగాడు వచ్చినా అతని నుండి ప్రేమ, పిల్లలను మాత్రమే ఆశిస్తాను....ఖరీదైన వస్తువుల ఏమీ ఆశించను' అని చెప్పింది.

స్లైడ్ షోలో ప్రియాంక చెప్పిన మరిన్ని వివరాలు....

కేవలం సమాజం కోసమే పెళ్లి

కేవలం సమాజం కోసమే పెళ్లి


ఈ సమాజం పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడాన్ని అంగీకరించదు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పింది.

పిల్లలంటే చాలా ఇష్టమట

పిల్లలంటే చాలా ఇష్టమట


నాకు పిల్లలంటే చాలా ఇష్టం. గంపెడు పిల్లల్ని కనాలని ఉంది. అందుకోసం మగాడి సహాయం తీసుకోక తప్పదు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే పెళ్లాడతాను అని స్పష్టం చేసింది.

ప్రేమ గురించి...

ప్రేమ గురించి...


ప్రేమ గురించి అడిగితే... తాను ప్రేమలో పడితే బయటకు చెప్పాల్సిన పని లేదు. ఒకటి మాత్రం నిర్భయంగా చెబుతున్నాను. ప్రేమించి మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టను, అందరిలో నిల్చోబెట్టి రెండు చెంపలు వాయిస్తాను అని తెలిపింది ప్రియాంక.

సినిమాలు..

సినిమాలు..


ప్రియాంక నటించ బాజిరావ్ మస్తానీ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆమె నటించిన జై గంగాజల్ విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు అమెరికన టీవీ సిరీస్ ‘క్వాంటికో'లో నటిస్తోంది. మరో హాలీవుడ్ షో బేవాచ్ కు ప్రియాంక ఎంపికైటన్లు సమాచారం.

English summary
"I have always wanted babies. Lots of them. For that reason I want to get married, It is not fair to bring a child to this world without marriage. Society is mean like that. I want to get married but no one can claim me until someone really claims me. When a guy comes into my life it will not be for diamonds. A guy will be in my life only when I am in love. I don't need a guy for anything else except for children." Priyanka Chopra said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu