»   »  అవును...! సెక్సీ గా ఉండటం నా వృత్తి లో ఒక భాగం

అవును...! సెక్సీ గా ఉండటం నా వృత్తి లో ఒక భాగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా హాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల నటి ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. క్వాంటికో ద్వారా విశేష ప్రాచూర్యం పొందిన ప్రియాంక తాజాగా 'బే వాచ్' అనే హాలీవుడ్ సినిమాలో చేస్తోంది. ప్రియాంక చోప్రాలో ఓ గొప్ప టాలెంట్ ఉంది. గ్లామర్‌ని చూపించి చూపించనట్టు ఉండే ప్రియాంక అందాల్ని ఏ మేరకు అరబోయాలో బాగానే తెలుసుకున్నట్టుంది.

తనని 'సెక్స్ సింబల్' అని పిలవడాన్ని తాను తప్పుబట్టనని అంటోంది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో 'క్వాంటికో' టీవీ సీరియల్ ద్వారా అంతర్జాతీయంగా పాప్యులారిటీ పొంది, ప్రస్తుతం 'బేవాచ్' ఆంగ్ల సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ సందర్భంగా సెక్స్ సింబల్ ట్యాగ్ విషయంపై స్పందిస్తూ, "సెక్సీ స్టార్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల నాకేమీ నామోషీగా లేదు.

Priyanka Chopra Says Being A Sex Symbol Is Part Of Her Job

వృత్తిలో అలా కనిపించడం ఒక భాగం. అలా కనిపించినప్పుడు అలాంటి సింబల్ మన మీద పడుతుంది. దానిని నేను తప్పుబట్టను. అయితే, శృంగారతారగా కనపడాలని, అలా పిలిపించుకోవాలని మాత్రం నేను ప్రయత్నించలేదు. దానికదే జరిగిపోయింది. కథను, సన్నివేశాలను బట్టి ఒక్కోసారి హాట్ గా కనిపించాలి. అలాంటప్పుడు అలాంటి సీన్లు చేయాల్సిందే" అని చెప్పింది ప్రియాంక.

ఆమధ్య గ్లామర్ ప్రదర్శనకి కోరతేమి లేకుండా బికినిలో దుమ్ము రేపింది. ఈ అమ్మడికి 'బే వాచ్' అనే హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కడంతో.. గ్లామర్‌పై ఇంకాస్త కేర్ తీసుకుని ఇంకా స్లిమ్‌గా మారి బికినీ అందాలలో ఆదరగొట్టేస్తుంది. లేటెస్ట్‌గా ఇంటర్నేషనల్ మ్యాగ్‌జైన్ ఎస్కైర్‌కు పోజులివ్వడంతో అందరు షాక్ అయ్యారు.

English summary
“Yes, being objectified is part of my job. I don’t get offended by being called a sex symbol, because I’m an actress and it’s the nature of what I do.” said Priyanka Chopra
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu