»   » మాజీ బాయ్‌ఫ్రెండుకు హీరోయిన్ లీగల్ నోటీసులు

మాజీ బాయ్‌ఫ్రెండుకు హీరోయిన్ లీగల్ నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్, మేనేజర్ ప్రకాష్ జాజుకు లీగల్ నోటీసులు పంపడం చర్చనీయాంశం అయింది. ప్రకాష్ జాజు జీవితం ఆధారంగా అసీమ్ మర్చంట్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై తనకున్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రియాంక చోప్రా నోటీసులు జారీ చేసింది.

తన గురించి, తన ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు జీవితానికి సంబంధించిన సినిమా కావడంతో.....సినిమాలో తమకు సంబంధించిన విషయాల ప్రస్తావన ఏమైనా ఉంటుందేమో అనే అనుమానంతో ప్రియాంక కోర్టు ద్వారా నోటీసులు పంచింది.

Priyanka Chopra sends legal notice to former boyfriend and manager

ప్రియాంక చోప్రా తరుపు న్యాయవాది ఆనంద్ దేశాయ్ ద్వారా ఈ నోటీసులు వారికి అందాయి. 'మీ(ప్రకాష్ జాజు) జీవితానికి సంబంధించిన విషయాల గురించి సినిమా వస్తుందని, అందులో నాక్లయింటుకు, ఆమె ఫ్యామిలీకి సంబంధించిన విషయాల ప్రస్తావన ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై నా క్లయింట్ ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ అదే నిజమైతే మీరు నా క్లయింట్ హక్కులకు భంగం కలిగించిన వారు అవుతారు.' అని తన నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రకాష్ జాజు, ప్రియాంక చోప్రా మధ్య గతంలో విబేధాలు వచ్చాయి. ప్రియాంక తనకు భారీ మొత్తం డబ్బు ఇవ్వాల్సి ఉందని, డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆరోపణలు చేసారు. అయితే ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా రంగలోకి దిగి జాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, బెదిరింపులకు గురి చేస్తున్నాడని జాజుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాడు. దీంతో జాజు 67 రోజులు జైలుకెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాష్ జాజు జీవితంపై సినిమా వస్తుండటంతో తమ ఫ్యామిలీకి సంబంధించి విషయాలను సినిమాల్లో ప్రస్తావిస్తారేమోనని ప్రయాంక ఆందోళన చెందుతోంది. ఆ సినిమా నిర్మించేది ప్రయాంక మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ కావడం గమనార్హం.

English summary
In a bid to thwart the biopic of her former manager, Prakash Jaju, Priyanka Chopra has sent a legal notice to her ex-boyfriend Aseem Merchant, who is producing the film. The actress believes that the film will revolve around her personal and professional life and has sent a copy of the notice to Jaju too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X