For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భాయ్ ప్రెండ్ కోసం బట్టలిప్పుతున్నభామ

    By Staff
    |

    Priyanka Chopra
    దోస్తానా చిత్రంలో బికినీ వేసుకుని కుర్రకారు మనుస్సులకు గేలం వేసిన ప్రియాంక చోప్రా మరో సారి అదే పని చేయనుంది. అయితే ఈ సారి ఆ పని ఏ నిర్మాత కోసమో,దర్శకుడు కోసమో,డబ్బులు కోసమో చేయటం లేదు.భాయ్ ప్రెండ్ హార్మన్‌ బవేజా కోసం బికినీ వేస్తోంది. హార్మన్‌ బవేజాతో ఆమె గతంలో 'లవ్‌స్టోరీ 2050' లో సినిమాలో చేసింది. అయితే అది భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో అతను మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చి హిట్ కొట్టడానికి తన వంతు సాయింగా తన శరీరాన్ని చూపెట్టడానికి రెడీ అవుతోంది.

    అయితే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు. ఓ ఐటం సాంగ్ మాత్రమే చేస్తోంది. చిత్ర నిర్మాత మన్‌మోహన్‌ శెట్టి అదేపనిగా ఓ ప్రత్యేక గీతాన్ని సినిమాలో చొప్పించాల్సిందిగా దర్శకుడు అజిత్‌ పాల్‌కి సూచించారు. వెంటనే ఆయన కూడా ఓ పాటను చొప్పించి ఇందుకు ప్రియాంకను ఒప్పించాల్సిందిగా హార్మన్‌ని కోరారు. ప్రియాంకను ఈ విషయమై హార్మన్‌ అడిగిన వెంటనే లేదనకుండా ప్రేమతో అంగీకరించిందని సమాచారం.

    ప్రత్యేక గీతం ఉంచాల్సిన అవసరం మన్‌మోహన్‌కి ఎందుకొచ్చిందని ఆరా తీస్తే... బయ్యర్లు సినిమా కొనడానికి వెనకాడుతున్నారట. గతంలో 'లవ్‌స్టోరీ 2050' బాక్సాఫీసు దగ్గర బోల్తా పడటంతో హార్మన్‌పై నమ్మకం లేక వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రియాంక చోప్రాతో ఓ అయిటమ్‌ పాటకు నృత్యం చేయిస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఇంతకీ ఈ అయిటమ్‌ పాట తాలూకూ ఆకర్షణ బయ్యర్లను ఆకర్షిస్తుందో లేదో గానీ ప్రియుడి కోసం ఆమె చేస్తున్న త్యాగం మాత్రం బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X