ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

By Bojja Kumar

హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా...మల్లికా షెరావత్ కారణంగా అప్‌సెట్ అయింది. 66వ కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌లో మళ్లికా షెరావత్ ఇండియాపై చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు కారణం. మహిళల విషయంలో భారత దేశం తిరోగమణ దశలో ఉందని దేశ ప్రజలను నిరూత్సాహ పరిచే విధంగా మల్లిక వ్యాఖ్యానించారు.

'UNICEF' కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక చోప్రా... మల్లికా షెరావత్ స్టేట్ మెంట్‌పై స్పందిస్తూ 'మన దేశం పురోగమణంలో ఉందని నా భావన. దేశం తిరోగమన దిశలో ఉందనే వాదనతో నేను ఏకీభవించను. మనం అంతా దేశంలో బాలికల ఎడ్యుకేషన్, వారి అభివృద్ధి గురించి ఎంతో కృషి చేస్తున్నాం. కానీ ప్రపంచ వేదికపై మల్లికా వ్యాఖ్యలు మనం చేస్తున్న కృషిని కప్పి పుచ్చేలా ఉన్నాయి.' అన్నారు.

మల్లికా షెరావత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ప్రియాంక వ్యాఖ్యానించారు. విచక్షణాజ్ఞానం లేకుండా, నిరుత్సాహ పరిచే విధంగా ఆమె మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. 'ఒక మహిళగా ఆమె వ్యాఖ్యలు నన్ను అప్ సెట్ చేసాయి. ఇండియా నుంచి వచ్చే ప్రతి బాలికను హర్ట్ చేసే విధంగా ఉన్నాయి' అంటూ తన ఆక్రోశాన్ని వెల్లగక్కింది.

ప్రియాంక చెప్పిన దాంట్లోనూ కొంత వాస్తవం ఉంది. మల్లిక చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై మనల్ని తక్కవ చేసి చూపిందని అంగీకరించాల్సిందే. 'UNICEF' ఈ వెంట్లో ప్రియాంక చోప్రా పాల్గొన్న దృశ్యాలను స్లైడ్ షోలో వీక్షించండి.

ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

ప్రియాంక చోప్రా యూనైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్(UNICEF) గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మై వరల్డ్ సర్వే అనే మొబైల్ అప్లికేషన్‌ను ఆమె లాంచ్ చేసారు

ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిటీజెన్స్ అభిప్రాయ సేకరణ జరుపుతారు.

ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

ఈ కార్యక్రమంలో మల్లికా షెరావత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రియాంక చోప్రా. ప్రపంచ వేదికపై ఆమె అలా మాట్లాడి ఉండకూడదు అని అభిప్రాయ పడ్డారు.

ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

మల్లికా షెరావత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఆమె వ్యాఖ్యలు విచక్షణాజ్ఞానం లేకుండా ఉన్నాయని విమర్శించారు.

ఇండియాపై మల్లిక విమర్శలు, ప్రియాంక చోప్రా ఫైర్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ ఇంటర్వ్యూలో మల్లికా షెరావత్ మాట్లాడుతూ...మహిళల విషయంలో భారత దేశం తిరోగమన దిశలో ఉందని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X