పెప్సీ అమ్మోరు: రామ్ చరణ్ హీరోయిన్ న్యూలుక్
ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా పెప్సి యాడ్ కోసం అమ్మోరు అవతారం ఎత్తింది. ఈ న్యూలుక్ ప్రియాంకకు సెట్టయిందో లేదో మీరే చెప్పండి! అందుకు సంబంధించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ప్రియాంక చోప్రా 'జంజీర్' చిత్రంలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హాట్ హాట్ పడక గది సన్నివేశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కూడా కూడా అందుకు సంబంధించిన కొన్ని సీన్లు కనిపించాయి. ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్లు చిత్రీకరించారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.
'తుఫాన్' చిత్రం 1973లో అమితాబ్, జయాబచ్చన్ జంటగా నటించిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా రూపొందించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈచిత్రం నిజాయితీగల పోలీసాఫీసర్, ఆయిల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. విలన్స్ వేసిన కుట్ర మూలంగా 6 నెలలు జైలుకు వెళ్లిన పోలీసాఫీసర్ వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ. రామ్ చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు, చరణ్-ప్రియాంక మధ్య జరిగే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి.

పెప్సీ యాడ్లో ప్రియాంక చోప్రా సంప్రదాయ లుక్.

ఆమె కట్టు, బొట్టు చూస్తుంటే అమ్మోరు గుర్తొస్తుంది కదూ...

ప్రస్తుతం ప్రియాంక చోప్రా రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న జంజీర్ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో చరణ్-ప్రియాంక మధ్య రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

పెప్సీ యాడ్లో ప్రియాంక చోప్రా సంప్రదాయ లుక్.
రామ్ చరణ్ ఈచిత్రంలో ఏసీపీ విజయ్ ఖన్నాగా... ఒరిజినల్ 'జంజీర్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో కనిపించబోతున్నారు. జయాబచ్చన్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది. 1973లో వచ్చిన 'జంజీర్' చిత్రంలో ఎలాంటి హాట్ సీన్లు లేవు. అయితే ఇప్పుడు రూపొందిస్తున్న రీమేక్ లో రామ్ చరణ్-ప్రియాంక మధ్య హీటెక్కించే బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు ప్లాన్ చేసారు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా వాటిని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











