చెర్రీ హీరోయిన్ డ్రెస్ చిరగకూడని చోట చిరిగెన్ (ఫోటో)
ముంబై: చిరిగిన డ్రెస్సులు వేసుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయాయి. చిరిగిన జీన్స్ ఫ్యాషన్ ట్రెండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు కూడా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పలు సందర్భాల్లో చిరుగుల ఫ్యాషన్ డ్రెస్‌లను వేసుకుని దర్శనం ఇచ్చింది.
అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రా.... చిరిగిన డ్రెస్‌తో కనిపించి నవ్వుల పాలైంది. ఎందుకంటే అది ఫ్యాషన్ చిరుగులు కాదు. నిజంగానే ఆ డ్రెస్ చంకల క్రింది భాగంలో చిరిగి పోయి ఉంది. అది గమనించని ప్రియాంక అలాగే వేసుకుని వచ్చింది. అది కాస్త ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కడం, ప్రియాంక పరువు పోవడం జరిగి పోయింది.
ప్రియాంక బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల ముంబైలో ఇందుకు సంబంధించిన ఈవెంట్ ఒకటి జరిగింది. ఆ కార్యక్రమానికి స్ర్కిన్ టైట్ డ్రెస్ వేసుకొచ్చిన ప్రియాంక... అక్కడ అందరికీ అభివాదం చెప్పడానికి చేయి పైకి లేపడంతో..... ఆమె డ్రెస్ చంక భాగంలో చిరిగిపోయి కనిపించింది. ఈ క్రింది ఫోటోలో ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. గతంలో ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా కూడ ఓ కార్యక్రమానికి టైట్ డ్రెస్ తో హాజరవ్వడం...అది కాస్త పిరుదుల భాగంలో చిగిరి పోవడంతో నవ్వుల పాలైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా.... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'జంజీర్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వంలో వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్ తొలి బాలీవుడ్ సినిమా కావడం, ప్రియాంక ఈ చిత్రం ద్వారా తొలి సారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండటం మరో విశేషం.


Click it and Unblock the Notifications











