40 రోజుల్లో 100 కోట్లు సంపాదించిన మన హీరోయిన్!
హైదరాబాద్: ఇండియాలో హీరోయిన్ల సంపాదన హీరోలతో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ ఒక హీరోయిన్ రూ. 100 కోట్ల సంపాదించాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత మొత్తం కేవలం 40 రోజుల్లో సంపాదించడం అంటే కేవలం హాలీవుడ్లో మాత్రమే సాధ్యం.
ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో పాటు అమెరికన్ టీవీ సీరిస్ లో నటిస్తున్న ప్రియాంక చోప్రా.... కూడా హాలీవుడ్ తారలతో పోటీ పడుతూ సంపాదిస్తోంది. అమెరికన్ టీవీ షో క్వాంటికో ద్వారా ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నప్రియాంక వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలోనూ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్లో ఆమె స్టార్ డమ్ రావడంతో పలు కార్పొరెట్ సంస్థలు తమ వాణిజ్య ప్రకటనలు ఆమెతో చేయడానికి పోటీ పడ్డారు. అలా ఇప్పుడు ఆమె 24 ప్రకటనల్లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
ఈ ప్రకటనల్లో నటించడం ద్వారా ప్రియాంక చోప్రా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని అంటున్నారు. ఈ సంపాదన కోసం ప్రియాంక కేటాయించిన సమయం కూడా చాలా తక్కువే. కేవలం 40 రోజులు మాత్రమే. ప్రియాంక చోప్రా చాలా ఎదిగిపోయింది కదూ!


Click it and Unblock the Notifications











