»   » ప్రియాంక చోప్రా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందా?

ప్రియాంక చోప్రా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆమె కూడా ఒకప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించిందట. ఈ విషయాన్ని ఆమె మాజీ మేనేజర్‌ ప్రకాశ్‌ జాజు వెల్లడించారు.

బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రకాశ్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన చెప్పేది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఎందుకంటే ప్రియాంక చోప్రాకు, ప్రకాశ్ కు చాలా కాలంగాపడటం లేదు.

 Priyanka Chopra tried committing suicide

'ఇప్పుడంటే ప్రియాంక చోప్రా చాలా స్ట్రాంగ్ ఉమెన్ గా కనిపిస్తోంది. కానీ కెరీర్ తొలినాళ్లలో ఆమె అలా ఉండేది కాదు. రెండు మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. నేనే అప్పుడు అడ్డుకున్నాను' అంటూ ట్వీట్ చేసాడు ప్రకాశ్.

2004లో మేనేజర్‌గా కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో ప్రియాంక వేరొకరిని తన మేనేజర్ గా నియమించుకుంది. మరి ఎందుకు ప్రియాంక అతన్ని కొనసాగించలేదు అనేది తెలియదు. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ముంబయిలోని అంధేరీ కోర్టులో ప్రకాశ్‌ ప్రియాంకపై కేసు వేశాడు. తర్వాత ప్రియాంక తండ్రి ప్రకాశ్‌పై కేసు వేసాడే. ఈ గొడవల నేపథ్యంలో ప్రకాశ్ 67 రోజుల పాటు జైల్లో ఉన్నాడు.

English summary
According to Priyanka Chopra's ex-manager Prakash Jaju, Priyanka was very vulnerable during her struggling days. "PC may look very strong now but she was also very vulnerable in struggling days, tried to commit suicide 2-3 times but i managed to stop her," he tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu