»   » స్టార్ హీరోయిన్ ఆత్మాహత్యాయత్నం.. బిల్డింగ్ పై నుంచి దూకాలని..

స్టార్ హీరోయిన్ ఆత్మాహత్యాయత్నం.. బిల్డింగ్ పై నుంచి దూకాలని..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక పక్క టీవీ స్టార్ ప్రత్యుష బెనర్జీ ఆత్మహత్యా ఘటనతో పరిశ్రమ షాక్‌లో ఉంటే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా సూసైడ్‌కు ప్రయత్నించిందని ఆమె మాజీ మేనేజర్ ప్రకాశ్ జాజు సంచలన విషయాన్ని వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో చాలా ఒత్తిడిలో ఉండేదని, దాదాపు మూడుసార్లు సూసైడ్ కు ప్రయత్నిస్తే తాను ఆపానని ఆయన ఇటీవల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రియుడితో గొడవ పడి ఓ సారి సూసైడ్ అటెంప్ట్

ప్రియుడితో గొడవ పడి ఓ సారి సూసైడ్ అటెంప్ట్

ప్రియుడు అసీమ్ మర్చంట్‌, ప్రియాంక చోప్రా ఎప్పుడూ గొడవ పడేవారని, తరచుగా పోట్లాడుకునే వారని తెలిపారు. ఓసారి అసీంతో గొడవ పడిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ముంబైలోని వాసాయ్ ప్రాంతానికి కారులో వెళ్లింది. ఆ విషయంతో తనకు తెలియడంతో అక్కడికి చేరుకొని ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నానని ఆయన తెలిపారు.

తల్లి మరణంతో కుంగిపోయి భవనంపై దూకేందుకు..

తల్లి మరణంతో కుంగిపోయి భవనంపై దూకేందుకు..

2002లో తన తల్లి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, ఆ సమయంలో బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నించిందని ప్రకాశ్ జాజు వెల్లడించారు. ఆ భయంతో ఇంటి చుట్టూ గ్రిల్స్ బిగించామని పేర్కొన్నారు.

రాత్రి 3 గంటల వరకు ప్రియాంక తన ప్రియుడు అసీంతో జాగారం చేసేదని, ఒక్కోసారి తెల్లవారుజాము వరకు ఆయన ఇంటిలో ఉంటే తానే తీసుకువచ్చేవాడనినని ప్రకాశ్ తెలిపారు.

ప్రియాంకపై క్రిమినల్ కేసు..

ప్రియాంకపై క్రిమినల్ కేసు..

తొలినాళ్లలో ప్రియాంక చోప్రాకు మేనేజర్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. పదే పదే కాంట్రాక్టును రద్దు చేయడంతో ప్రకాశ్ జాజు ఓ దశలో ప్రియాంకపై ముంబై కోర్టులో క్రిమినల్ కేసు నమోదు నమోదు చేశారు.

 ప్రకాశ్‌కు 67 రోజుల జైలుశిక్ష

ప్రకాశ్‌కు 67 రోజుల జైలుశిక్ష

మేనేజర్‌తో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో తన కూతురు ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడంటూ ప్రకాశ్ పై ప్రియాంక తండ్రి కేసు పెట్టారు. దాంతో ప్రకాశ్ 67 రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది.

క్వాంటికో, బేవాచ్‌లో హాట్‌గా ప్రియాంక

క్వాంటికో, బేవాచ్‌లో హాట్‌గా ప్రియాంక

ప్రస్తుతం ప్రియాంక చోప్రా అన్ని ఒత్తిడుల నుంచి బయటపడి బాలీవుడ్, హాలీవుడ్ లో అగ్రతారగా నిలబడింది. ఇటీవల క్వాంటికో, బేవాచ్ అనే చిత్రంలో హాట్ హాట్ గా నటించింది.

ఒంటరిగా ముంబైకి పంపొద్దని సలహా

ఒంటరిగా ముంబైకి పంపొద్దని సలహా

చిత్ర పరిశ్రమలో కెరీర్ ను ఎంచుకొనే క్రమంలో తమ పిల్లలను ముంబైకి ఒంటరిగా పంపించకూడదు. పిల్లలు ఒంటరిగా ఉండటం వల్ల డ్రగ్స్, మద్యానికి అలవాటు పడుతారు. అని పలు సందర్భాలను ఉదహరిస్తూ స్టార్లు ఒత్తిడి సమయంలో ఎలాంటి చర్యలకు పాల్పడుతారనే విషయాన్ని ఇటీవల ప్రకాశ్ జాజు పలు ట్వీట్ల ద్వారా వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో చేరే పలు సూచనలు చేశారు.

English summary
Priyanka Chopra may look very strong now but she was also very vulnerable in struggling days, tried to commit suicide 2-3 times but i managed to stop her," Prakash Jaju tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu