ఆ హీరోయిన్...వేశ్య కూతురిగా?
బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు. ఫ్యాషన్ లాంటి సినిమాల్లో చాలెంజింగ్ రోల్స్ చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన డాన్ 2 చిత్రం ఈరోజు విడుదల కాగా...హృతిక్ రోషన్ తో కలిసి నటించిన 'అగ్నిపథ్' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం అగ్నిపథ్ సినిమాలో కూడా ప్రియాంక చాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఇందులో ఆమె వేశ్య కూతురుగా కనిపించనుంది.
ఈ పాత్రపై గురించి ప్రియాంక మాట్లాడుతూ...''ఇది సినిమాకు బలమైన పాత్ర, నేను వేశ్య కూతురు పాత్ర పోషిస్తున్నాను, ఆ పాత్ర తల్లి బాటలో నడవటానికి అస్సలు ఇష్టపడదు' అని చెప్పుకొచ్చింది. ఫ్యాషన్, సాత్ ఖూన్ మాఫ్ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకకు ఈ సినిమాలో చేస్తున్న విభిన్నమైన రోల్ మరింత కీర్తి తెస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ల టాప్ రేసులో కాస్త వెనక బడ్డ ప్రియాంక...ఈ సినిమాలతోనైనా మళ్లీ అగ్రస్థానానికి చేరుతుందో? లేదో? మరికొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











