»   »  చేతికి మంగళసూత్రం: పెళ్లి రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా

చేతికి మంగళసూత్రం: పెళ్లి రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి రెండు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రియాంక రహస్యంగా వివాహం చేసుకుందని, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి జరిగిందని... పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు మెడలో వేసుకోవాల్సిన మంగళ సూత్రాన్ని చేతికి కట్టుకుందనే వార్తలు హల్ చల్ చేశాయి.

  ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం ఇటీవల ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోలో ఆమె చేతికి మంగళసూత్రాన్ని పోలిన బ్రాస్‌లెట్ లాంటి వస్తువు కనిపించడమే. తన కు పెళ్లయినట్లు వచ్చిన వార్తలపై ప్రియాంక చోప్రా స్పందించారు.

  'నా గురించి హైరేంజిలో వచ్చిన స్పెక్యులేషన్స్ విని నవ్వొస్తుంది. నా చేతికి ఉన్నది మంగళసూత్రం కాదు. దీన్ని ఈవిల్ ఐ అంటారు. ఇప్పటికైనా ఈ ప్రచారం ఆపండి. నేను పెళ్లి చేసుకుంటే తప్పకుండా మీకు చెబుతాను. రహస్యంగా ఏమీ చేసుకోను... అని ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.

  గతేడాది ప్రియాంక చోప్రా తాను కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, కానీ వర్కౌట్ కాలేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు ఆమె సింగిల్‌గానే ఉన్నారు. ఇప్పటికీ ఆమె తనకు తగిన జోడీని ఎంచుకోలేదు. హాలీవుడ్లో చాలా మందితో ప్రియాంక డేట్‌కు వెళుతోందని, కానీ ఎవరితోనూ రిలేషన్‌షిప్ కమిట్ కాలేదని టాక్.

  వర్క్ పరంగా.... ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్లో నటిస్తోంది. ఆమె బాలీవుడ్లో నటించి చాలా కాలం అయింది. త్వరలో సల్మాన్ ఖాన్, అలీ అబ్బాస్ కాంబినేషన్లో రాబోతున్న 'భరత్' అనే చిత్రంలో నటించబోతోంది. ఈ చిత్రం 2019 ఈద్‌కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  Priyanka Chopra sent netizens into a tizzy when she posted a picture of herself wearing what looked like a mangalsutra on her wrist. Soon, rumours of her getting married in secret began doing the rounds. She took to Twitter to share a close-up picture of the 'mangalsutra', which was revealed to be an evil eye bracelet. "Hahahah! heights of speculation! This is an evil eye guys! Calm down! I'll tell u when I get married and it won't be a secret! Lol (sic)," Priyanka captioned it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more