Just In
- 21 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 57 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 11 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
Don't Miss!
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చరణ్ ‘తుఫాన్’ ఆడియో వేడుక కళ తప్పనుందా?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య ఆడియో వేడుకలకు ఏ రేంజిలో ప్రాధాన్యత పెరిగి పోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆడియో వేడుక జరిగే తీరు, విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి సినిమా ఓపెనింగ్స్ ప్రభావితం అవుతున్నాయి. అందుకే వీలైనంత గ్రాండ్‌గా ఆడియో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల ఆడియో వేడుకల సందడి అంతా ఇంతా కాదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. 'తుఫాన్' ఆడియో వేడుక ఈ రోజు శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే ఈ వేడుకకు హీరోయిన్ ప్రియాంక చోప్రా హాజరు కావడం లేదు.
<blockquote class="twitter-tweet blockquote"><p><a href="https://twitter.com/search?q=%23Toofan&src=hash">#Toofan</a> music release Tom in Hydrabad..Can't b thr as I'm promoting <a href="https://twitter.com/search?q=%23Zanjeer&src=hash">#Zanjeer</a> in mumbai.Will miss all d excitement but good luck team!miss me</p>— PRIYANKA (@priyankachopra) <a href="https://twitter.com/priyankachopra/statuses/372018035759915008">August 26, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>హిందీ వెర్షన్ 'జంజీర్' కోసం ముంబైలో నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల 'తుఫాన్' ఆడియో వేడుకకు హాజరు కాలేక పోతున్నాను అంటూ ప్రియాంక చోప్రా తన ట్విట్టర్లో పేర్కొంది. ప్రియాంక గైర్హాజరు వల్ల ఆడియో వేడుక కళ తప్పనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.