»   » 'జంజీర్‌' షూటింగ్... హోటల్ వద్ద ఫ్యాన్స్ హంగామా

'జంజీర్‌' షూటింగ్... హోటల్ వద్ద ఫ్యాన్స్ హంగామా

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రామ్‌ చరణ్‌, ప్రియాంక చోప్రాల కాంబినేషన్ లో అపూర్వ లఖియా రూపొందిస్తున్న చిత్రం 'జంజీర్‌'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపధ్యంలో ప్రియాంక చోప్రా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఆమె స్టే చేసిన ప్రెసిడెన్షియల్ హోటల్ వద్ద అభిమానులు విపరీతంగా గుమిగూడుతున్నారు. ఆమెను తమ కెమెరాల్లో బంధించి,తమ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పెట్టుకోవాలని ఫ్యాన్స్ విపరీతంగా ట్రైల్స్ వేస్తున్నారు.

  ముఖ్యంగా హోటల్ పరిసరాల్లో సీన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె అభిమానులు విపరీతంగా సందడి చేస్తున్నారు. హిందీ సినిమాలకు హైదరాబాద్ లోనూ ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆమెకు ఇక్కడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సందడి మధ్యలోనే ప్రియాంకను మీడియాను కలుస్తోంది. ఆమె మీడియాతో సంతోషంగా మాట్లాడుతూ..''హీరోయిన్ గా అన్ని రకాల పాత్రలూ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాణిజ్య సినిమాలకే పరిమితమైపోతున్న నేటి తరం నాయికల్లో నేనూ ఒకదానిగా ఉండడం ఇష్టం లేదు. అందుకే అప్పుడప్పుడూ నాలోని నటి కోసం కొన్ని వైవిధ్యమైన చిత్రాల్ని ఎంపిక చేసుకొంటున్నాను''అని చెప్పింది ప్రియాంక చోప్రా.

  ఆమె మాట్లాడుతూ ''కమీనే, సాత్‌ ఖూన్‌ మాఫ్‌, ఫ్యాషన్‌, వాట్స్‌ యువర్‌ రాశి... ఇలాంటి సినిమాలు నేను ఒప్పుకొన్నానంటే అందులో నటించడానికి ఎంతో అవకాశం ఉండటం వల్లే! ఇకపై కూడా ప్రతి ఏడాది అలాంటి సినిమా ఒకటి ఉండేలా చూసుకొంటాను. ఇటీవల బాలీవుడ్‌లో నాకు అవకాశాలు లేక నేనేదో పాటలు పాడుకొనేందుకు సిద్ధమయ్యాయని కొందరు పుకార్లు సృష్టించారు. అందులో నిజం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటికి తోడు సంగీతాన్ని కూడా పూర్తిస్థాయిలో కెరీర్‌గా తీసుకొంటున్నా అంది.

  హృతిక్‌ రోషన్‌తో నటించిన క్రిష్‌ సీక్వెల్‌ వచ్చే దీపావళికి వస్తుంది. ఇప్పుడు రామ్‌చరణ్‌తో 'జంజీర్‌' చిత్రీకరణలో పాల్గొంటున్నా. దీని తరవాత లాస్‌ఏంజెలిస్‌లో నా సంగీత ఆల్బమ్‌కి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాను. వచ్చే ఏడాది 'మిలన్‌ టాకీస్‌', 'గన్‌డే' చిత్రాల్ని చేయాల్సి ఉంది. ఇక ఖాళీ ఎక్కడ ఉంటుంది?'' అని ప్రశ్నించింది.

  English summary
  Priyanka Chopra is in Hyderabad for for the shooting of Apoorva Lakhia’s Zanjeer and is staying at the hotel’s presidential suite amid tight security. Droves of the actor’s fans have been flocking to the hotel, just hanging out in the hope to catch a glimpse of the star. One fan, who has been tracking his favorite star, is planning to upload a photo blog of her in town. He says Priyanka’s pink trailer has become very famous and many now recognize it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more