For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫుల్ సెక్సీ..... రామ్ చరణ్ హీరోయిన్ హాట్ ఫోటో షూట్ (ఫోటోలు)

  By Srikanya
  |

  ముంబై: రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ మూవీ 'జంజీర్'లో నటిస్తున్న ప్రియాంక చోప్రా తాజాగా ఓగ్ కవర్ పేజీకి ఫోటో షూట్ చేసింది. కెమెరా ఎదురుగా ఉంటే తనకు వేరే ప్రపంచం కనపడదనే ప్రియాంక ఈ ఫోటో షూట్ లో అందరినీ మైమరిచిపోయేలా చేసింది. ప్రియా తన్నా.. వోగ్ ఇండియా ఎడిటర్ ఆమెను ఎంపిక చేయటంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందంన్నారు. ఆమెను వోగ్ ఇండియా మార్చి కవర్ గర్ల్ గా తీసుకోవటం వెనక ఆమె కీర్తి మాత్రమే కాక కష్టం కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

  అరుదైన వ్యక్తిత్వం ప్రియాంకదని, పనిలో పూర్తి స్ధాయిలో నిమగ్నమయ్యే ఆమె పద్దతి ఆదర్శం అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ ట్యాలెంటెడ్ యాక్టర్, ఫ్యాషన్ ఐకాన్ తమ పత్రికకే అందం తెచ్చిందని మురసిపోయారు. అందులోనూ ప్రియాంకకు ఇప్పుడున్న డిమాండ్ వేరు..ఆమెను సంజయ్ లీలా భన్సాలీ దగ్గర నుంచి అందరూ తమ సినిమాల్లో తీసుకోవాలని సంప్రదిస్తున్నారు.

  మరీ ముఖ్యంగా ఆమె జంజీర్ రీమేక్ లో చేయటం తమని బాగా ఆకర్షించింది అంటున్నారు ఆ ఎడిటర్. ఆమె మాట్లాడుతూ.. "ప్రియాంక చాలా ప్రొఫిషినల్.. తన పనికి, క్రాప్ట్ కు చాలా కమిటయ్యి ఉంటుంది. ఆమెకు సినిమా రోల్స్ ఎంత ఛాలెంజ్ గా బావించి చేస్తుందో.. అంతన్నా బాగా ఆమెలో వ్యక్తిత్వం, ఆమె మృదుతత్వం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి." అన్నారామె.

  వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజికి ప్రియాంక ఇచ్చిన హాట్ ఫోటో షూట్...ఆమె ప్రతిభా విశేషాలు... స్లైడ్ షో లో...

  వరల్డ్‌‌స సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ ఉమన్‌ కిరీటం బాలీ వుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు దక్కింది. ఆసియాకు చెందిన వారపత్రిక ఈస్ట్రన్‌ ఐ ఈ ఏడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు.

  పోటాపోటీగా సాగిన ఈ కాంపిటీషన్‌లో విజయం ప్రియాంకను వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందగత్తెలు పోటీపడ్డారు. అందగత్తెల సామ్రాజ్యాన్ని ఏలిన బాలీవుడ్‌ నటీ కరీనాకపూర్‌, మూడుసార్లు విజేతగా నిలిచిన కత్రినా కైఫ్‌లను సైతం మూడు పదుల ప్రియాంక ఓడించిందని ఈస్ట్రన్‌ ఐ వెల్లడించింది. ఈ సర్వేలో రెండు, మూడు స్థానాలను వరుసగా కరీనా, త్రినాలకు దక్కాయి.

  ‘ఇట్లాంటి అవార్డు యిస్తే ఎవరు తిరస్కరిస్తారు. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని ఆనందం వెల్లివిరిసిన ముఖంతో ప్రియాంక చోప్రా అన్నారు.

  ఈస్ట్రన్‌ ఐ షో బిజ్‌ ఎడిటర్‌ అస్‌జాద్‌ నాజిర్‌ మాట్లాడుతూ 2013లో ప్రియాంక చోప్రా హాలివుడ్‌ నటిగా ఎదిగేందుకు సంపూర్ణమైన వేదిక లభించాలని ఆశిస్తున్నానన్నారు.

  త్వరలో పెళ్లికి రెడీ అవుతోంది. బాలీవుడ్ నుంచి అందుతున్న వివరాల ప్రకారం ఆమె హిందీ టెలివిజన్ నటుడు మోహిత్ రైనాను పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ టీవీ సీరియల్ ‘మహదేవ్'లో శివుని పాత్ర చేసిన మోహిత్ రైనా బాగా పాపులర్ అయ్యాడు.

  ఆస్కార్ అవార్డుల రేసులో ‘బర్ఫీ' నిలవకపోవడంపై ప్రియాంక చోప్రా విచారం వ్యక్తం చేసింది. ఆమె బర్పీ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి ఎంట్రీ దొరకకపోవటంతో మీడియా వద్ద వాపోయింది. అయితే భారత్ తరఫున ‘బర్ఫీ' చిత్రాన్ని ఆస్కార్ అవార్డు కోసం అధికారికంగా ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

  ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ సరసన జంజీర్ రీమేక్ లో చేస్తోంది. ఆమె ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి సహజీవనం చేసే పాత్ర చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

  ‘జంజీర్' బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు.. మాలా గా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.

  ‘జంజీర్'... ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు.

  ‘జంజీర్' చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

  ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రక్కన చేయటానికి ఆమె భారీ మొత్తమే వసూలు చేసిందంటున్నారు.

  అయితే తాను ‘జంజీర్' ఒప్పుకోవటానికి రెమ్యునేషన్ కారణం కాదని, కేవలం.. ‘జంజీర్' అంటే తనుకున్న ఇష్టమే ఈ సినిమాలో పాత్ర చేసేలా ప్రేరేపించిందని చెప్తోంది.

  English summary
  The camera loves her. But she's quite a dynamo off it as well. Gracing Vogue India's March cover, Priyanka Chopra looks spectacular in a 'Barnett Newman' linen bralet, designed by Shivan & Naresh, 'Double Duchess' bell cape, Burberry Prorsum and Silk shorts from Prada. Priya Tanna, Editor, Vogue India, throws light on Vogue India's March cover girl — the talented actor, singer and fashion icon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X