»   » 6 సార్లు పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్

6 సార్లు పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ ప్రియాంక చోప్రా అందచందాలు, అభినయం, పాపులారిటీ గురించి పక్కన పెడితే....అమ్మడు వయసు ప్రస్తుతం 31. కంట్రీలోనే మెస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరెట్. పెళ్లి విషయంలో ప్రియాంక చోప్రాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. అయితే 6 సార్లు పెళ్లి చేసుకుంటానని ఆమె చెబుతున్న విషయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

అయితే ప్రియాంక చోప్రాను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఒకరినే...కానీ ఆరు సార్లు ఆరు రకాలుగా పెళ్లి చేసుకోవాలనేది ఆమె కోరికట. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మ్యారేజ్ ప్లాన్ గురించి సవివరంగా వెల్లడించింది.

'అందరు ఆడపిల్లల్లానే నాకు పెళ్లి విషయంలో చిన్నప్పటి నుండే చాలా ప్లాన్స్ ఉన్నాయి. డిఫరెంటు పద్దతుల్లో ఆరు సార్లు పెళ్లి చేసుకోవాలని ఉంది...అఫ్ కోర్స్ ఒకరినే అనుకోండి. ప్రతిసారి డిఫరెంటుగా చేసుకోవాలి. మొదట మా పూర్వీకుల స్వస్థలం అయిన అంబాలాలో నా పెళ్లి జరుగాలి, అక్కడ మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వేడుక జరుపుకోవాలి' అని వెల్లడించారు.

'రెండో సారి వివాహం ఆస్ట్రేలియాలోని గ్రేట్ బార్రియర్ రీప్‌లో అండర్ వాటర్లో పెళ్లి చేసుకోవాలని. మూడో సారి హాలీవుడ్ సినిమా స్టైల్లో డ్రెస్ వేసుకుని లాస్‌వెగాస్ చేసుకోవాలని ఉంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని స్మాల్ చర్చ్ లాకార్నోలో, అనంతరం నిఖా పద్దతిలో చేసుకోవాలని ఉంది. నిఖా అనేది ఎంతో బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సెర్మనీ అని నా భావన. చివరది ఎలా అనేది నాకు కాబోయేవాడు నిర్ణయిస్తాడు' అని చెప్పుకొచ్చొంది ప్రియాంక. ఇన్ని విషయాలు చెప్పుకొచ్చిన ప్రియాంక....మరి ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే మాత్రం, ఆ విషయం ఇప్పుడే చెప్పలేనంటోంది.

English summary

 Priyanka Chopra is one of the most gorgeous and ravishing looking actress in the industry. She is also considered to be one of the most eligible bachelorette in the country. So when Priyanka was asked about her marriage plans, she shocked everyone by saying that she wanted to get married six times. Before you get any ideas, she wants those six marriages with the same man but each time in a different manner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu