అతడితో కమిటెడ్ రిలేషన్‌షిప్, ఇపుడు విడిపోయాం: నోరువిప్పిన హీరోయిన్

By Bojja Kumar

Recommended Video

Priyanka Chopra Finally Opens Up

హీరోయిన్ ప్రియాంక చోప్రా రిలేషన్‌షిప్, లవ్ ఎఫైర్ల గురించి ప్రశ్నలు అడిగితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మాజీ విశ్వసుందరి తొలిసారిగా తన రిలేషన్ షిప్ గురించి ఒప్పుకుంది. తాను ఒక వ్యక్తితో చాలా కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అయితే సంవత్సరం క్రితమే మేము విడిపోయాము అని తెలిపారు.

 మరో వ్యక్తి నా జీవితంలోకి రాలేదు

మరో వ్యక్తి నా జీవితంలోకి రాలేదు

సంవత్సర కాలంగా నేను సింగిల్‌గానే ఉంటున్నాను. అప్పటి నుండి చాలా మందిని కలిశాను. వారితో కలిసి తిరిగాను. అయితే వారిలో ఎవరూ ఇప్పటి వరకు నా మనసుకు నచ్చలేదు, మరో వ్యక్తి నా జీవితంలోకి ఇంకా రాలేదు అని ప్రియాంక చోప్రా తెలిపారు.

 ఎవరా లక్కీమ్యాన్?

ఎవరా లక్కీమ్యాన్?

తొలిసారిగా ప్రియాంక చోప్రా తాను ఒక వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను అని ఒప్పుకోవడంతో ఈ విషయం బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ మాజీ ప్రపంచ సుందరిని పడగొట్టిన ఆ లక్కీ మ్యాన్ ఎవరు? అని చర్చించుకుంటున్నారు.

ఇంతలాంగ్ టైమ్ సింగిల్‌గా ఎప్పుడూ లేను

ఇంతలాంగ్ టైమ్ సింగిల్‌గా ఎప్పుడూ లేను

ఇంత లాంగ్ టైమ్ నేను సింగిల్ గా ఎప్పుడూ లేను. దాదాపు సంవత్సరం కంటే ఎక్కువే అయింది. ఇలా ఉండటం కూడా కొత్తగా ఉంది, ఇష్టంగా ఉంది.... అని ప్రియాంక చోప్రా తెలిపారు.

 భారతీయుడా? విదేశీయుడా?

భారతీయుడా? విదేశీయుడా?

ప్రియాంక చోప్రా ‘క్వాంటికో' సిరీస్, ‘బేవాచ్' హాలీవుడ్ సినిమా కోసం చాలా కాలం అమెరికాలో గడిపింది. పేరు బయట పెట్టక పోవడంతో మరి ఆమె బాయ్ ఫ్రెండ్ భారతీయుడా? యూనైటెడ్ స్టేట్స్ కు చెందిన వాడు అయి ఉంటాడా? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

 ఒక వ్యక్తికే తన సర్వస్వం

ఒక వ్యక్తికే తన సర్వస్వం

ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తాను సీరియల్ మోనోగేమిస్ట్ అని తెలిపింది. అంటే ఇద్దరు ముగ్గురితో రిలేషన్ మెయింటేన్ చేయకుండా.... ఒక వ్యక్తితోనే రిలేషన్ నడిపానని, అతడికే తన సర్వస్వం అర్పించానని అర్థం.

 మైండ్‌సెట్ సహకరించడం లేదు

మైండ్‌సెట్ సహకరించడం లేదు

మరొకరితో రిలేషన్‌షిప్ కమిట్ కావడానికి తన మైండ్ సెంట్ ఇంకా సిద్ధం కాలేదని, అందుకు కొంచెం సమయం పట్టవచ్చని ప్రియాంక చోప్రా తెలిపారు.

కెరీర్ గోల్స్ ముఖ్యం

కెరీర్ గోల్స్ ముఖ్యం

తనకు ఇపుడు రిలేషన్ షిప్ కంటే కూడా కెరీర్ గోల్స్ ముఖ్యమని, దానిపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు.

 బాలీవుడ్ సినిమాలు దూరమైన ప్రియాంక

బాలీవుడ్ సినిమాలు దూరమైన ప్రియాంక

అమెరికా టీవీ సిరీస్, హాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిన తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రాల్లకు దూరం అయ్యారు. గతేడాది బాలీవుడ్లో ప్రియాంక నటించిన ఒక్క మూవీ కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం ఎ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటి? అనే హాలీవుడ్ చిత్రాల్లో ప్రియాంక చోప్రా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X