అదిరేటి డ్రెస్సు నువ్వేస్తే...ప్రియా నీ ముస్తాబుకి సాటెవ్వరు....!?
'అదిరేటి డ్రెస్సు నువ్వేస్తే… హుందాగ నవ్వు నడిచొస్తే… దడ" అంటూ ఫ్యాషన్ ట్రెండును ఆవిష్కరించిన సినీగీతం సంగీత ప్రియులకు కరతామలకం!. బాలీవుడ్ బేబీ ప్రియాంకా చోప్రాను చూసి ఇప్పుడు ఇదేపాట పాడుకోవాలి. ఎందుకంటే యావత్ దేశంలో ఈ ముద్దుగుమ్మ ముస్తాబుకి మరెవరూ సాటిరారని ఒక సర్వే చాటిచెప్పింది. సాధారణ దుస్తుల్లో కూడా స్టయిలిష్ గా మెరుపులు మెరిపించే బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా 'ఇండియాస్ బెస్ట్ డ్రేసేడ్' వనితగా ఎంపికైంది. వస్త్రధారణలో ఈ ఒయ్యారిదే అగ్రస్థానమని పీపుల్స్ మ్యాగజైన్ తేల్చిచెప్పింది.
సందర్భోచిత వస్త్రదారణలో ప్రియాంక వివేకాన్ని సదరు సర్వే వేనోళ్ళ పొగిడింది. 29 ఏళ్ళ ఈ మాజీ ప్రపంచ సుందరి వస్త్ర విన్యాసం అపూర్వమని, అద్వితీయమని శ్లాఘించింది. భారత్ లో ఆమె ఫ్యాషన్ కి ప్రతీకగా నిలుస్తుందని ప్రశంసల జల్లు కురిపించింది. మనీష్ మల్హోత్రా వస్త్రరూపకల్పనలో 'మెర్సిడెస్- బెంజ్ బెస్ట్ డ్రెస్డ్ షో 2011"లో ర్యాంప్ పై హొయలొలికించిన ప్రియాంకకు సదరు మ్యాగజైన్ ఈ పట్టం కట్టింది. అరుదైన ఈ టైటిల్ తనకు దక్కుతుందని ఊహిచలేదంటూ చిరునవ్వుతో ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేసిందీ అమ్మడు.
బాలీవుడ్ ఫిల్మిం ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ గా చలామనిణి అవుతోన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా, ప్రస్తుతం ప్రియాంక అగ్నిపత్, డాన్ 2, బర్ఫీ చిత్రాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











