»   » ప్రియాంక చోప్రా...ఇండియా గర్వ పడేలా చేసింది!

ప్రియాంక చోప్రా...ఇండియా గర్వ పడేలా చేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరోసారి ఇండియా గర్వ పడేలా చేసింది. అమెరికాలో పీపుల్స్ చాయిస్ అవార్డ్ గెలుచుకుంది. అమెరికన్ టీవీ థ్రిల్లర్ సిరీస్ ‘క్వాంటికో' ద్వారా ఇంటర్నేషనల్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె తన సత్తా చాటింది. పీపుల్స్ చాయస్ అవార్డు గెలుచుకున్న తొలి సౌత్ ఏషియన్ నటి కూడా ఆమెనే కావడం విశేషం.

అభిమానుల ఓటింగ్ ద్వారా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఈ పోటీలో ఆమె ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఎమ్మా రాబర్ట్స్, జామీ లీ కర్టిస్, లియా మిచెల్, మార్సియాగే హార్డన్ లాంటి వాళ్లను వెనక్కినెట్టి ఈ అవార్డు దక్కించుకున్నారు. లాస్ ఏంజిల్స్ లో నిర్వహిస్తున్న అవార్డు కార్యక్రమంలో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Priyanka Chopra wins People's Choice Award

'క్వాంటికో'లో పోలీసు అధికారిగా ప్రియాంక అలెక్స్‌ పార్సి పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్లో శృంగారాత్మక సన్నివేశాల్లోనూ ప్రియాంక నటించటం సంచలనం రేపింది. ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్ లలో ప్రియాంక ట్రైనింగ్ తీసుకుంటున్న ఎఫ్.బి.ఐ. అధికారిగా నటించింది. అమెరికా ట్విన్ టవర్స్ కూలిన 9/11 ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సీరియల్ తెరకెక్కించారు.

English summary
Bollywood actress and former Miss World Priyanka Chopra made India proud yet again by winning a People's Choice Award for her international debut as FBI agent Alex Parish in American TV thriller series "Quantico". She is said to be the first South Asian actress to win the honour.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu