»   » షాకిస్తున్న ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం..డేటింగ్ ఎప్పుడో అయిపోయిందట..!

షాకిస్తున్న ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం..డేటింగ్ ఎప్పుడో అయిపోయిందట..!

Subscribe to Filmibeat Telugu
Priyanka Chopra Finally Opens Up

బాలీవుడ్ లోనేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రియాంక చోప్రా సంచలన నటి. ఈ 35 ఏళ్ల ముదురు సుందరి అందాలు ఇప్పటికీ కుర్ర కారు కళ్ళు తిప్పలేని విధంగా ఉంటాయి. ప్రియాంక చోప్రా అండ చందాలకు హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. అక్కడ కూడా చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మూడు పదుల వయసులో ఉన్నా ఇంకా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు.

 ప్రపంచ సుందరిగా

ప్రపంచ సుందరిగా

ప్రపంచ సుందరిగా ప్రియాంక 2000 సంవత్సరంలో కిరీటాన్ని దక్కించుకున్న ప్రియాంక బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం ప్రపంచ సుందరి అనే బ్రాండ్ తో కాకుండా నటిగా అందం, అభినయంతో కట్టి పడేసింది. బడా నిర్మాతలు అప్పటినుంచి ప్రియాంక కాల్ షీట్ల కోసం ఎగబడడం ప్రారంభించారు.

 బోలెడన్ని లవ్ ఎఫైర్స్

బోలెడన్ని లవ్ ఎఫైర్స్

సినీ పరిశ్రమల స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య ఎదో జరుగుతోందంటూ వార్తలు రావడం సహజం. అలాంటి వార్తలు ప్రియాంక చుట్టూ చాలా అలుముకుని ఉన్నాయి. కానీ ఆ వార్తలపై ప్రియాంక ఎప్పుడూ స్పందించలేదు.

 వివాదాలు కూడా అదే స్థాయిలో

వివాదాలు కూడా అదే స్థాయిలో

ప్రియాంక చోప్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఏదోఒక వివాదంలో వేలు పెట్టి మరి ఇరుక్కోవడం ప్రియాంకకు అలవాటే. తద్వారా సోషల్ నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ ముందు పొట్టి బట్టలతో కూర్చుని లేనిపోని వివాదంలో ఇరుక్కుంది.

 డేటింగ్ పూర్తయిపోయిందంటూ సంచలనం

డేటింగ్ పూర్తయిపోయిందంటూ సంచలనం

ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నా తన వ్యక్తిగత విషయాలని మాత్రం ప్రియాంక ఎప్పుడూ బయట పెట్టలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రియాంక చూపా సంచలన విషయం బయట పెట్టింది. తాను ఓ వ్యతి తో ఘాడమైన ప్రేమలో మునిగితేలానని ప్రకటించింది. అతడితో డేటింగ్ తంతు కూడా పూర్తి చేశా అంటూ సంచలన విషయాన్ని ప్రకటించింది.

 ఆ పని పూర్తయ్యాక బ్రేక్ అప్

ఆ పని పూర్తయ్యాక బ్రేక్ అప్

డేటింగ్ తంతు పూర్తి చేశానంటూ ప్రియాంక సంచలన విషయాన్ని ప్రకటించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కానీ డేటింగ్ పూర్తయ్యాక తన ప్రేమ కథ ముందుకు సాగలేదట. అక్కడితో బ్రేక్ అప్ అయిపోయిందని తెలిపింది.

ఎవరా వ్యక్తి

ఎవరా వ్యక్తి

ప్రియాంక చోప్ర తో డేటింగ్ చేసిన ఆ సుందరాంగుడు ఎవరనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. బాలీవుడ్ కు చెందిన వ్యక్తా లేక హాలీవుడ్ తాలుకాన అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 క్వాంటికో నటుడితో మరో ఎఫైర్

క్వాంటికో నటుడితో మరో ఎఫైర్

బాలీవుడ్ లో ప్రియాంక ప్రతాపం అందాల్ని ఆరబోయడం వరకే ఆగిపోయింది. కానీ హాలీవుడ్ కు వెళ్ళాక శృంగార సన్నివేశాల్లో సైతం పీసీ చెలరేగిపోయింది. ప్రస్తుతం పీసీ క్వాంటికో సిరీస్ లోని ఓ నటుడితో డీప్ లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలని ప్రియాంకా ఖండించింది. నేను వారితో ప్రేమలో పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారందరికీ పెళ్ళైపోయిందని ప్రియాంక సరదాగా వ్యాఖ్యానించింది.

English summary
Priyanka Chorpa made sensational statemnet on her love affair. She did dating with one guy. After dating the love story was braek up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu