‘ఇంద్ర’హిందీ రీమేక్ పై ప్రియాంక్ దత్ స్పందన
చిరంజీవి నటించిన 'ఇంద్ర' చిత్రం భారీ విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని మెగా దర్శకుడు బి.గోపాల్ డెైరెక్ట్ చేయగా... మెగా చిత్రాల నిర్మాత అశ్వినీదత్ భారీ వ్యయంతో దీన్ని నిర్మించారు. పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తాజాగా బాలీవుడ్లో రీమేక్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం హిందీ రీమేక్ రెట్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయమై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ మాట్లాడుతూ...ఇంద్ర రీమేక్ రైట్స్ కోసం చాలా ఆపర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ ఎవరకీ రైట్స్ ఇవ్వలేదు. ఈ సినిమాని మా ప్రొడక్షన్ లోనే హిందీలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది...ఎవరితో చేస్తారు వంటి విషయాలు ఆమె మీడియాకు తెలియచేయలేదు. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాసముందని సమాచారం.
ఇక సంజయ్ లీలా బన్సాలీ ఇటీవల 'విక్రమార్కుడు' రీమేక్ రెైట్స్ దక్కించుకుని రౌడీ రాథోడ్' పేరుతో ప్రభుదేవాతో డెరక్ట్ చేయించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో మరిన్ని పాత సూపర్ హిట్ తెలుగు సినిమాలపె ఆసక్తి చూపిస్తున్నాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్రం రీమేక్ ఆలోచనకు వచ్చాడని ప్రచారం జరిగింది.
అంతేగాక బాలీవుడ్ మీడియా ఈ రూమర్ ని కొనసాగిస్తూ.. తాజాగా ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో చేస్తే మంచి ఫలితాలను ఇస్తుందని, సల్మాన్ వయస్సు, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతుందని బన్సాలీ భావిస్తున్నారని, సల్మాన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్..ఏక్తా టైగర్ బిజీలో ఉన్నారు. ఆ తర్వాత రవితేజ కిక్ రీమేక్ చేసే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











